ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల రోజువారీ ఖర్చుల వివరాలు వెల్లడించిన ఈసీ

ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల హడావిడి నడుస్తోంది.

Update: 2024-04-21 12:30 GMT

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల హడావిడి నడుస్తోంది. ఎన్నికలు దగ్గరపడుతోన్నా కొద్ది రాజకీయ నాయకులు తమ ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఒక పార్టీకి మించి ఒక పార్టీ పోటాపోటీగా ప్రచారాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ప్రజలను మచ్చిక చేసుకునేందుకు హామీల మీద హామీలు గుప్పిస్తున్నారు. ఇకపోతే ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల రోజువారీ ఖర్చుల వివరాలను తాజాగా ఎన్నికల సంఘం వెల్లడించింది. వీడియో చిత్రీకరణ(నెల)కు రూ.45,000, ఫంక్షన్ హాల్ రోజుకు రూ.20, 000, హోర్డింగ్స్-రూ.6000, రంగుల్లో పోస్టర్లు - రూ. 5000, వ్యాన్- రూ.7000, ఇన్నోవా- రూ.3500, డ్రైవర్ సహా సుమో- రూ.3000, ఇన్నోవా- రూ.3500, ప్రచారరథం- రూ.3000, ఎల్‌ఈడీ స్క్రీన్- రూ.5000, బిగ్ సైజ్ బెలూన్స్ రోజుకు రూ.20, 000, షామియానా- రూ.12000, పవర్ జనరేటర్ - రూ.7000 రూపాయలుగా ఈసీ వెల్లడించింది.


Similar News