కార్మికుల కనీస వేతనాన్ని రూ.1,035 కు పెంచిన కేంద్ర ప్రభుత్వం

అసంఘటిత రంగంలోని కార్మికులకు మద్దతుగా వారి కనీస వేతన రేట్లను పెంచుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

Update: 2024-09-26 17:35 GMT

దిశ, వెబ్ డెస్క్ : అసంఘటిత రంగంలోని కార్మికులకు మద్దతుగా వారి కనీస వేతన రేట్లను పెంచుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. వేరియబుల్ డియర్‌నెస్ అలవెన్స్‌(VDA)ను సవరించడం ద్వారా కార్మికులకు కనీస వేతనాన్ని రోజుకు రూ.1,035 వరకు పెంచుతూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. పెరుగుతున్న జీవన వ్యయాలను తట్టుకునేలా కార్మికులకు సహాయపడే లక్ష్యంతో ఈ సవరణలు చేసినట్లు కార్మిక మంత్రిత్వ శాఖ పేర్కొంది.

సవరణల తర్వాత కనీస వేతన రేట్లు..

*నిర్మాణ, స్వీపింగ్, క్లీనింగ్, లోడింగ్ & అన్‌లోడింగ్‌లో నైపుణ్యం లేని పని కోసం కార్మికులకు 'A' ప్రాంతంలో కనీస వేతనాలు రోజుకు రూ. 783 (నెలకు రూ. 20,358)గా సవరించారు.

*సెమీ స్కిల్డ్ కార్మికులకు, కనీస వేతనం రోజుకు రూ. 868 (నెలకు రూ. 22,568)గాను సవరించారు.

*పనిముట్లు అవసరం లేని, క్లరికల్ వంటి కార్మికులకు రోజుకు రూ. 954 (నెలకు రూ. 24,804)గా సవరించారు.

*అత్యంత నైపుణ్యం కలిగిన కేటగిరికి చెందిన కార్మికుల కనీస వేతన రేటు రోజుకు రూ. 1,035 (నెలకు రూ. 26,910)గా నిర్ధారించింది.

కాగా కొత్త వేతన రేట్లు అక్టోబర్ 1, ౨౦౨౪ నుండి అమలులోకి వస్తాయి. కార్మికుల వేతన రేట్లకు సంబంధించిన చివరి సవరణ ఏప్రిల్ 2024లో జరిగింది. అయితే కనీస వేతన రేట్ల నైపుణ్య స్థాయిలు.. అన్ స్కిల్డ్, సెమీ-స్కిల్డ్, స్కిల్డ్ మరియు హైలీ స్కిల్డ్ తోపాటు భౌగోళిక ప్రాంతం ఆధారంగా A, B మరియు C లుగా వర్గీకరించబడ్డాయి.


Similar News