Robert Vadra: ప్రధాని మోడీ 'దలాల్ ఔత్ దామాద్' వ్యాఖ్యలపై రాబర్డ్ వాద్రా విమర్శలు

మరోసారి ప్రధాని తన పేరును వాడటం చాలా ఆశ్చర్యంగా ఉందన్నారు.

Update: 2024-09-26 19:30 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల కాంగ్రెస్ గురించి చేసిన వ్యాఖ్యలపై ప్రముఖ వ్యాపారవేత్త, గాంధీ కుటుంబానికి చెందిన సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా స్పందించారు. హర్యానాలో ఓటమిని జీర్ణీంచుకోలేని ప్రధాని మోడీ ఆయన పదవికి ఉన్న గౌరవాన్ని మరిచి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ తన ప్రసంగంలో హర్యానాలో గత కాంగ్రెస్ ప్రభుత్వాలు అవినీతిని ప్రోత్సహిస్తున్నాయని ఆరోపించారు. కాంగ్రెస్ హయాంలో వ్యక్తిగత సిఫార్సులు అవసరం లేని ఒక్క ఉద్యోగం కూడా రాష్ట్రంలో లేదని ఆరోపించారు. పదేళ్ల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతుల భూములు లాక్కున్నారు. కాంగ్రెస్ హర్యానాను దలాల్‌లకు(దళారులు), దామాద్‌లకు (అల్లుళ్లకు) అప్పగించింది. కాంగ్రెస్ హయాంలో వ్యక్తిగత సిఫార్సులు అవసరం లేని ఒక్క ఉద్యోగం కూడా రాష్ట్రంలో లేదని మోడీ అన్నారు.

ప్రధాని మోడీ ఆరోపణలపై రాబర్ట్ వాద్రా స్పందిస్తూ, మరోసారి ప్రధాని తన పేరును వాడటం చాలా ఆశ్చర్యంగా ఉందన్నారు. కేంద్రంతోపాటు హర్యానాలోనూ వారి పార్టీ అధికారంలో ఉంది. గత దశాబ్ద కాలంలో వారు కమీషన్లు ఏర్పాటు చేసుకున్నారని నాకు తెలుసు. తద్వారా విచారణ చేయవచ్చు. రాబర్ట్ వాద్రా ధింగ్రా కమిషన్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ.. తనతో పాటు తన సంస్థలపై దర్యాప్తు చేయడానికి ఏర్పాటైన కమిషన్ ఏమైందని ప్రశ్నించారు. గత దశాబ్దంలో తాను చేసే అన్ని పనులకు ఆటంకం కలిగించడానికి ప్రధాని మోడీ అన్ని విధాలా ప్రయత్నించారు. తన కంపెనీలకు అనేక విచారణలు, నోటీసులు పంపినప్పటికీ, తనకు వ్యతిరేకంగా ఏమీ రుజువు కాలేదని స్పష్టం చేశారు. నా కంపెనీల పని తీరులో తప్పు లేదు కాబట్టి వారు ఏమీ నిరూపించలేరని పేర్కొన్నారు. ప్రధాని మోడీ 'దలాల్ ఔర్ దామాద్ '(దళారి, అల్లుడు) వ్యాఖ్యల పట్ల వాద్రా అసంతృప్తి వ్యక్తం చేశారు. 

Tags:    

Similar News