ఆధార్, పాన్ వివరాలు బహిర్గతం చేసిన వెబ్ సైట్లపై కేంద్రం సీరియస్ యాక్షన్స్

పౌరుల ఆధార్(Adhar), పాన్ కార్డ్(Pan Card) వివరాలు బహిర్గతం చేసిన పలు వెబ్ సైట్లపై కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది.

Update: 2024-09-26 17:51 GMT

దిశ, వెబ్ డెస్క్ : పౌరుల ఆధార్(Adhar), పాన్ కార్డ్(Pan Card) వివరాలు బహిర్గతం చేసిన పలు వెబ్ సైట్లపై కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది. ఇలాంటి వెబ్ సైట్లను బ్లాక్ చేస్తూ.. మరిన్ని వెబ్ సైట్స్ కు సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. ఆధార్, పాన్ వివరాలతోపాటు, పలు సున్నితమైన అంశాలతో కూడిన సమాచారాన్ని కొన్ని వెబ్ సైట్స్ ఎలాంటి భద్రతా ప్రమాణాలు పాటించకుండా బహిర్గతం చేస్తున్నట్టు కేంద్ర ఐటీ శాఖ గుర్తించింది. వ్యక్తిగత సమాచార గోప్యతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్న కేంద్ర ప్రభుత్వం ఈ ఘటనపై తక్షణమే స్పందించి, వెబ్ సైట్లను బ్లాక్ చేయించింది. మరికొన్నింటికి నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు వెబ్ సైట్ల చర్యలను తీవ్రంగా పరిగణిస్తున్నామని కేంద్ర ప్రభుత్వం ఓ ప్రకటన జారీ చేసింది. 


Similar News