రైతులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు
రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను ఆరు రబీ పంటలకు మద్దతు ధర పెంచుతూ కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. మంగళవారం ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక
దిశ, డైనమిక్ బ్యూరో: రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను ఆరు రబీ పంటలకు మద్దతు ధర పెంచుతూ కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. మంగళవారం ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ పంటలకు కనీస మద్దతు ధరను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. కేబినెట్ తీసుకున్న నిర్ణయాలను సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ మీడియాకు వివరించారు. కందులకు అత్యధికంగా ఎంఎన్పీ క్వింటాల్‌కు 500 రూపాయల పెంచినట్లు వెల్లడించారు. గోధుమలపై క్వింటాల్‌కు రూ.110 , బార్లీపై రూ.100, సన్ ప్లవర్ క్వింటాల్‌కు రూ.209, ఆవాలపై రూ.400, బార్లీ రూ.100, శనగలు రూ.105 పెరిగింది. తాజాగా కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర పెంచడంతో గోధుమల ధర క్వింటాలుకు రూ. 2,125 కు పెరిగింది. ఆవాలు రూ.5,450, కందులు రూ.6000, సన్ ఫ్లవర్ రూ.5,650, శనగలు రూ.3,335, ఆవాలు రూ.5,450 కి పెరిగినట్లు ఠాకూర్ వెల్లడించారు. గత ప్రభుత్వంతో పోల్చితే మోడీ ప్రభుత్వం రైతుల ఆదాయం రెట్టింపు చేసిందని ఠాకూర్ చెప్పారు. కోవిడ్ సమయంలో కూడా కేంద్ర ప్రభుత్వం రైతుల వద్ద నుండి పూర్తి ధాన్యం చేకరించామని అన్నారు. వ్యవసాయ రంగ ఉత్పత్తి, ఎంఎస్పీ పెరిగాయని వెల్లడించారు. ప్రపంచ వ్యాప్తంగా పోల్చి చూస్తే గత 30-40 ఏళ్లలో ద్రవోల్యణం లేని దేశాలలో కూడా ప్రస్తుతం ద్రవోల్యణం అధికంగా ఉంటోందని ఆ దేశాలతో పోల్చితే భారత్ లో నియంత్రణలోనే ఉందని మంత్రి స్పష్టం చేశారు.