రాజకీయాల్లో దూకుడు పెంచిన దళపతి విజయ్.. రేపే ఫస్ట్ పార్టీ మీటింగ్!
తమిళ అగ్ర హీరో దళపతి విజయ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పా్ల్సిన అవసరం లేదు. ఒక్క తమిళంలోనే కాకుండా తెలుగు, కన్నడ, హిందీ, మళయాలం భాషల్లోనూ ఆయనకు ఫ్యాన్స్ ఉన్నారు.
దిశ, వెబ్‌డెస్క్: తమిళ అగ్ర హీరో దళపతి విజయ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పా్ల్సిన అవసరం లేదు. ఒక్క తమిళంలోనే కాకుండా తెలుగు, కన్నడ, హిందీ, మళయాలం భాషల్లోనూ ఆయనకు ఫ్యాన్స్ ఉన్నారు. ఇటీవల ఆయన నటించిన ‘లియో’ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ.600 కోట్లకు పైగా కలెక్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన మూవీ లవర్స్‌కు షాకిచ్చి.. పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నట్లు ప్రకటించారు. తమిళగ వెట్రి కళగం పేరుతో పార్టీని స్థాపించారు. సోషల్ మీడియా వేదికగా స్వయంగా ఆయనే పార్టీ ప్రకటన చేశారు.
ప్రకటన అనంతరం ఇన్నాళ్లు మౌనంగా ఉన్న విజయ్.. తాజాగా స్పీడ్ పెంచినట్లు తెలుస్తోంది. పార్టీ తొలి సమావేశాన్ని రేపు నిర్వహించనున్నట్లు ప్రకటించారు. చెన్నై శివారులోని పణయూర్లోని పార్టీ కార్యాలయాన్ని వేదికగా ఫిక్స్ చేశారు. పార్టీ జిల్లాల అధ్యక్షులు, ముఖ్య నేతలతో విజయ్ సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో పార్టీ సభ్యత్వ నమోదు, బూత్ కమిటీల ఏర్పాటులపై కీలక చర్చించనున్నారు. అయితే, విజయ్ దూకుడు పెంచడంతో ప్రధాన పార్టీల్లో అలజడి మొదలైనట్లు తెలుస్తోంది.