Thalapathy Vijay: తలపతి విజయ్ ఫ్యాన్స్‌కు హార్ట్ బ్రేకింగ్ న్యూస్.. ఆ విషయంలో సంచలన నిర్ణయం!

తలపతి విజయ్.. ఆ పేరు వింటేనే ఓ వైబ్రేషన్.. కోట్లల్లో ఆభిమానులు ఆయన సొంతం.

Update: 2024-09-14 04:01 GMT

దిశ, వెబ్‌డెస్క్: తలపతి విజయ్.. ఆ పేరు వింటేనే ఓ వైబ్రేషన్.. కోట్లల్లో ఆభిమానులు ఆయన సొంతం. తమిళనాడులో మాత్రమే కాదు అన్ని రాష్ట్రాల్లోనూ విజయ్‌కి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. సినీ కెరీర్‌లో ఎన్నో హిట్స్ మరెన్నో బ్లాక్ బస్టర్లు కొట్టిన తలపతి ఊహించని నిర్ణయం తీసుకోబోతున్నట్లుగా తెలుస్తోంది. త్వరలోనే ఆయన సినిమాలకు గుడ్ బై చెప్పబోతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే 69వ సినిమా తన కెరియర్‌లోనే చివరిదంటూ అని విజయ్ ప్రకటించారు. ఆ మూవీ తరవాత ఆయన ప్రత్యక్ష్య రాజకీయాల్లోకి అడుగుపెట్టబోతున్నారు. కాగా, విజయ్ ఫిబ్రవరి 2న టీవీకే పార్టీని ప్రకటించారు. ఆగస్టు 22న తన పార్టీకి జెండాను, గుర్తును ఆవిష్కరించారు. అనంతరం పనైయూర్ పార్టీ కార్యాలయంలో జెండా ఎగురవేసి, రాజకీయ పార్టీకి సంబంధించిన అధికారిక పాటను కూడా విడుదల చేశారు. ఈ జెండాకు రెండు రంగుల మెరూన్, పసుపు జెండాలో రెండు వైపులా ఏనుగులు, మధ్యలో నక్షత్రాలు చుట్టూ నెమలి ఉన్నాయి. తమిళనాడు సంక్షేమం కోసమే పార్టీ ఏర్పాటు చేసినట్లుగా విజయ్ తెలిపారు. తాజాగా, ఇటీవలే ఆ పార్టీకి జాతీయ ఎలక్షన్ కమిషన్ గుర్తించింది.   


Similar News