Mp: బోరు బావిలో పడ్డ బాలుడు మృతి?
మధ్యప్రదేశ్ గుణ జిల్లాలో బోరు బావి(Borewell)లో పడిన పదేళ్ల బాలుడి మృతి చెందినట్లు తెలుస్తోంది..
దిశ, వెబ్ డెస్క్: మధ్యప్రదేశ్ గుణ జిల్లా(Madhya Pradesh Guna)లో బోరు బావి(Borewell)లో పడిన పదేళ్ల బాలుడి(Boy) మృతి చెందినట్లు తెలుస్తోంది. రఘోఘర్ జంజలి ప్రాంతం(Raghogarh Janjali area)లో బాలుడు ఆడుకుంటూ వెళ్లి బోరుబావిలో పడ్డాడు. వెంటనే 39 అడుగుల వద్ద బావిలో ఉండిపోయారు. శనివారం సాయంత్రం 6 గంటలకు ఈ ఘటన జరిగింది. అయితే విషయం తెలుసుకున్న రెస్క్యూ టీమ్ బోరుబావికి సమాంతరం గొయ్యి తవ్వారు. క్లిష్టమైన రెస్యూ ఆపరేషన్ చేసి బాలుడికి బయటకు తీశారు. అనంతరం ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ బాలుడు మృతి చెందినట్లు తెలుగుస్తోంది. ఆస్పత్రి వైద్యుల నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.