శివసేన పేరు, పార్టీ గుర్తు కోసం రూ.2,000 కోట్ల డీల్

పాలన మార్పు ఫలితంగా ఒక్కొక్కరికి రూ.50 కోట్లు ఇచ్చామని చెప్పారన్నారు.

Update: 2023-02-19 09:12 GMT

ముంబై: శివసేన పార్టీ పేరును గుర్తును షిండే వర్గానికి కేటాయించంపై మరోసారి ఉద్ధవ్ థాక్రే వర్గం తీవ్రంగా మండిపడింది. శివసేన పార్టీ పేరును గుర్తును పొందేందుకు రూ.2,000 కోట్లతో ఒప్పందం చేసుకున్నారని ధాక్రే వర్గం నేత ఎంపీ సంజయ్ రౌత్ ఆరోపించారు. గత ఏడాది పార్టీ ఫిరాయించిన 40 మంది ఎమ్మెల్యేలకు, భారీ గందరగోళం మధ్య, పాలన మార్పు ఫలితంగా ఒక్కొక్కరికి రూ.50 కోట్లు ఇచ్చామని చెప్పారన్నారు.'ఇది ప్రారంభ విలువ.. 100 శాతం నిజం. త్వరలో మరిన్ని విషయాలు బయటకు వస్తాయి. ఇంతకుముందెన్నడు దేశ చరిత్రలో ఇలాంటివి జరగలేదు' అని హిందీలో ట్వీట్ చేశారు. శుక్రవారం ఈసీ శివసేన పార్టీ పేరును, గుర్తును మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే వర్గానికి కేటాయించిన సంగతి తెలిసిందే. అయితే ఈసీ మోడీకి బానిసలాగా వ్యవహరిస్తుందని ఉద్ధవ్ థాక్రే మండిపడ్డారు. మరోవైపు రౌత్ ఆరోపణలను షిండే వర్గం తోసిపుచ్చింది. ఈ ఒప్పందంలో సంజయ్ రౌత్ ఏమైనా క్యాషియరా అంటూ సెటైర్లు వేసింది.

Also Read..

Breaking News.... బీజేపీకి భారీ షాక్

Tags:    

Similar News