తమిళనాడు ఎంపీకి రూ.908 కోట్ల ఫైన్

తమిళనాడులో అధికార ప్రభుత్వం డీఎంకేకు చెందిన ఎంపీ మీద ఈడీ భారీ ఫైన్ వేసింది.

Update: 2024-08-28 11:50 GMT

దిశ, వెబ్ డెస్క్ : తమిళనాడులో అధికార ప్రభుత్వం డీఎంకేకు చెందిన ఎంపీ మీద ఈడీ భారీ ఫైన్ వేసింది. డీఎంకే తరుపున అరక్కోణం లోక్ సభ స్థానం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎస్. జగత్రరక్షకన్ మీద ఏకంగా రూ.908 కోట్ల జరిమానా విధిస్తూ ఈడీ ఆర్డర్స్ జారీ చేసింది. విదేశీ మారకద్రవ్య నిర్వహణ చట్టం(ఫెమా) నిబంధనలు ఉల్లంఘించిన కేసులో జగత్రరక్షకన్ తోపాటు ఆయన కుటుంబ సభ్యుల మీద ఈడీ ఈ జరిమానా వేసినట్టు తెలుస్తోంది. ఫెమా చట్టం ప్రకారం.. 2020 లో జగత్రరక్షకన్ కు చెందిన రూ.89.19 కోట్ల విదేశీ మారకద్రవ్యాన్ని ఈడీ జప్తు చేసింది. ఈ కేసుకు సంబంధించిన తీర్పు వెలువడిన నేపథ్యంలో ఈడీ ఈ చర్యలు చేపట్టింది.  


Similar News