కళాశాలల్లో హిజాబ్ ధరించొచ్చు : సుప్రీం సంచలన తీర్పు

కళాశాలల్లో విద్యార్థినిలు హిజాబ్ ధరించడాన్ని సమర్థించింది సుప్రీంకోర్ట్.

Update: 2024-08-09 10:25 GMT

దిశ, వెబ్ డెస్క్ : కళాశాలల్లో విద్యార్థినిలు హిజాబ్ ధరించడాన్ని సమర్థించింది సుప్రీంకోర్ట్. ముంబైకి చెందిన ఓ కళాశాల విద్యార్థినులు హిజాబ్ ధరించి రావడాన్ని నిషేధించింది. దీన్ని సవాలు చేస్తూ వారు బాంబే హైకోర్టుకు వెళ్ళగా.. కళాశాలలో విద్యార్థులందరూ సమనమేనని అలాంటపుడు వారికి మాత్రం ప్రత్యేక సౌకర్యం ఎందుకని ప్రశ్నిస్తూ కళాశాల యాజమాన్య నిర్ణయాన్ని సమర్థించింది. కాగా విద్యార్థుల తరపున కోణం స్వచ్ఛంద సంస్థలు సుప్రీం కోర్టులో అప్పీల్ చేయగా.. విద్యార్థినులు హిజాబ్ ధరించడానికి అనుమతినిచ్చింది. హిజాబ్ పై నిషేధం విధిస్తే మహిళా సాధికారత ఎలా సాధ్యపడుతుందని కళాశాల యాజమాన్యాన్ని సుప్రీం ప్రశ్నించింది. గతంలో బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పుపై కూడ తాత్కాలిక స్టే విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.   


Similar News