న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు మహారాష్ట్ర బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్స్‌పై కీలక వ్యాఖ్యలు చేసింది. మహారాష్ట్ర ప్రభుత్వం 12 మంది ఎమ్మెల్యేలపై విధించిన సస్పెన్షన్ రద్దు రాజ్యాంగ విరుద్ధమని శుక్రవారం తీర్పునిచ్చింది. వారిపై నిషేధాన్ని రద్దు చేస్తున్నట్లు పేర్కొంది. ఎమ్మెల్యేలపై అంత సమయం నిషేధం విధించడం రాజ్యాంగ విరుద్ధం తో పాటు చట్టవిరుద్ధమని తెలిపింది. అసెంబ్లీ తీర్మానాలు చట్టం దృష్టిలో ద్వేషపూరితమైనవి, అసమర్థ మైనవిగా ప్రకటించబడ్డాయని తెలిపింది. గత ఏడాది జూలై 5న 12 మంది ఎమ్మెల్యేలు మహారాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరకరంగా ప్రవర్తించారని ఏడాది పాటు నిషేధం విధించింది.
దీనిపై సుప్రీంకోర్టు తాజాగా తీర్పునిచ్చింది. మహారాష్ట్ర బీజేపీ చీఫ్ దేవేంద్ర ఫడ్నవీస్ సుప్రీంకోర్టు తీర్పును స్వాగతించారు. 'సుప్రీంకోర్టు 12 ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు ను రద్దు చేయడం చారిత్రక నిర్ణయం. ఇలాంటి నిర్ణయాలు ప్రజాస్వామ్య విలువలను కాపాడుతాయి. మహా ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధం, అనైతికం, చట్ట వ్యతిరేక చర్యలకు చెంప దెబ్బ లాంటిది' అని ట్వీట్ చేశారు. తదుపరి నిర్ణయానికి ముందు సుప్రీంకోర్టు తీర్పుపై వివరణాత్మక ఉత్తర్వుల కోసం వేచి ఉన్నట్లు మహా ప్రభుత్వం తెలిపింది. మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ తుది నిర్ణయం తీసుకుంటారని పేర్కొంది.