Supreme Court: అలీగఢ్ యూనివర్సిటీకి మైనార్హీ హోదాపై సుప్రీం కోర్టు కీలక తీర్పు
దిశ, వెబ్‌డెస్క్: అలీగఢ్ యూనివర్సిటీపై సుప్రీం కోర్టు కీలక తీర్పు వెలువరించింది. యూనివర్సిటీకి మైనార్టీ హోదా ఇవ్వడానికి నిరాకరిస్తూ 2005లో అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టు కొట్టివేసింది. 4:3 మెజారిటీతో యూనివర్సిటీకి మైనార్టీ హోదా ఉందంటూ ధర్మాసనం తీర్పు వెలువరించింది. కాగా.. ఏడుగురు సభ్యుల ఈ ధర్మాసనంలో జస్టిస్ సంజీవ్ ఖన్నా, జేబీ పర్దివాలా, మనోజ్ మిశ్రా, జస్టిస్ సూర్యకాంత్, దీపాంకర్ దత్త, సతీశ్ చంద్ర శర్మలు ఉన్నారు. వీరిలో సీజేఐతో పాటు జస్టిస్ సంజీవ్ ఖన్నా, జేబీ పర్దివాలా, మనోజ్ మిశ్రాలు మైనార్టీ హోదా ఉండాలని తీర్పునిస్తే.. జస్టిస్ సూర్యకాంత్, దీపాంకర్ దత్త, సతీశ్ చంద్ర శర్మలు వ్యతిరేకంగా తీర్పునిచ్చారు.
ఇదిలా ఉంటే విద్యా సంస్థ నియంత్రణ, పరిపాలన విషయంలో పార్లమెంట్‌లో చట్టం చేసినా.. ఆ విద్యాసంస్థకు ఉన్న మైనార్టీ హోదాను రద్దు చేసే అవకాశం లేదని అత్యున్నత ధర్మాసనం స్పష్టం చేసింది. పార్లమెంట్ చట్టంతో అలీఘడ్ ముస్లిం వర్సిటీ మైనార్టీ హోదా రద్దు అయినట్లు 1968లో ఇచ్చిన తీర్పుతో పాటు 2005లో అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు ధర్మాసనం కొట్టిపారేస్తున్నట్లు సీజే చంద్రచూడ్ వెల్లడించారు. ‘అడ్మినిస్ట్రేషన్‌లో మైనార్టీ సభ్యులు లేనంత మాత్రాన.. ఆ వర్సిటీ మైనార్టీ హోదా పోదు’ అని సుప్రీంకోర్టు తన తీర్పులో పేర్కొంది.