సుప్రీంకోర్టుకు ఇద్దరు కొత్త న్యాయమూర్తుల నియామకం

నియామకాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదిస్తూ ఉత్తర్వులను జారీ చేశారు.

Update: 2024-07-16 10:30 GMT

దిశ, నేషనల్ బ్యూరో: భారత అత్యున్నత న్యాయస్థానంలో ఇద్దరు కొత్త న్యాయమూర్తులను చేరారు. జస్టిస్ ఎన్ కోటీశ్వర్ సింగ్, జస్టిస్ ఆర్ మహదేవన్ నియామకాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదిస్తూ ఉత్తర్వులను జారీ చేశారు. ఈ మేరకు కేంద్ర న్యాయశాఖ సహాయమంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ మంగళవారం ప్రకటనలో తెలిపారు. కొత్తగా ఇద్దరు న్యాయమూర్తుల పదోన్నతిపై సుప్రీంకోర్టు కొలీజియం గతంలో సిఫారసు చేసింది. దాంతో ఈ రెండు నియామకాలతో సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) డీవై చంద్రచూడ్‌తో సహా 34కి చేరింది. కొత్తగా నియమించబడిన వారిలో ఎన్ కోటీశ్వర్ సింగ్ ప్రస్తుతం లద్దాఖ్, జమ్మూకశ్మీర్ హైకోర్ట్ ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నారు. అలాగే, ఆర్ మహదేవన్ మద్రాస్ హైకోర్టు చీఫ్ జడ్జిగా పనిచేస్తున్నారు. కాగా, జస్టిస్ ఎన్ కోటీశ్వర్ సింగ్ మణిపూర్ నుంచి సుప్రీంకోర్టుకు పదోన్నతి సాధించారు. దీంతో ఈ రాష్ట్రం నుంచి సుప్రీంకోర్టుకు ఎన్నికైన మొట్టమొదటి జడ్జిగా ఆయన రికార్డును దక్కించుకున్నారు. అంతేకాకుండా తొలి మణిపూర్ అడ్వకేట్ జనరల్ ఎస్ ఇబోటోంబికి కోటీశ్వర్ సింగ్ కావడం విశేషం. ఢిల్లీ వర్శిటీలో ఉన్న కిరోరి మాల్ కాలేజ్ నుంచి లా సెంటర్‌లో న్యాయవాద విద్యను పూర్తి చేసిన ఆయన, 1986లో న్యాయవాదిగా వృత్తిని ప్రారంభించారు. జడ్జి కాకమునుపు మణిపూర్ అడ్వకేట్ జనరల్‌గా కూడా ఆయన విధులు నిర్వహించారు. మరో న్యాయమూర్తి జస్టిస్ మహదేవన్ మద్రాస్ లా కాలేజీలో విద్యాభ్యాసం చేశారు.  


Similar News