Sunita Williams: వెల్‌కం టూ ఎర్త్.. భూమిపై సురక్షితంగా దిగిన సునీతా విలియమ్స్ (వీడియో)

ఉత్కంఠకు ఎట్టకేలకు ఎండ్ కార్డ్ పడింది.

Update: 2025-03-19 01:40 GMT
Sunita Williams: వెల్‌కం టూ ఎర్త్.. భూమిపై సురక్షితంగా దిగిన సునీతా విలియమ్స్ (వీడియో)
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: ఉత్కంఠకు ఎట్టకేలకు ఎండ్ కార్డ్ పడింది. 8 రోజుల యాత్ర కోసం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ISS) వెళ్లి.. 9 నెలలు అక్కడే చిక్కుకుపోయిన భారత సంతతికి చెందిన సునీతా విలియమ్స్‌ (Sunita Williams)తో పాటు మరో ముగ్గురు వ్యోమగాములు సురక్షితంగా భూమిపై ల్యాండ్ అయ్యారు. డ్రాగన్ క్యాప్సూల్‌ (Dragon Capsule)లో 17 గంటల ప్రయాణం అనంతరం భూ వాతావరణంలోకి చేరుకున్నారు. భారత కాలమానం ప్రకారం ఇవాళ తెల్లవారుజామున 3.27 గంటలకు ఫ్లోరిడా సముద్ర జలాల్లో డ్రాగన్ క్యాప్సూల్ ల్యాండ్ అయింది. ఈ నేపథ్యంలోనే నాసా శాస్త్రవేత్తలు యూఎస్ ప్రజల్లో వాళ్లు ఎలా ల్యాండ్ అవుతారోనని టెన్షన్ వాతావరణం నెలకొంది. గంటకు 116 మైళ్ల వేగంతో డ్రాగన్ క్యాప్సూ్ల్ (Dragon Capsule) భూమి దిశగా పయనించింది. భూమిని చేరుకుంటున్న నేపథ్యంలో వ్యోమ నౌకలోని పారాచ్యూట్‌లు ఒక్కొక్కటిగా తెరుచుకుని ఫ్లోరిడా సముద్ర జలాల్లో డ్రాగన్ క్యాప్సూల్ సురక్షితంగా ల్యాండ్ అయింది. అనంతరం క్యాప్సూల్ బయటకు వచ్చిన వ్యోమగాములు నిక్ హేగ్ (Nick Hague), గోర్బునోవ్‌ (Gorbunov), సునీతా విలియమ్స్ (Sunita Williams), విల్‌మోర్‌‌ (Wilmore)లు ప్రజలకు అభివాదం చేశారు. అనంతరం వారిని నాసా సిబ్బంది బోట్ల ద్వారా బయటకు తీసుకొచ్చారు.

వ్యోమగాములు సేఫ్: నాసా

భూమిపై ల్యాండ్ అయిన వ్యోమగాములు సురక్షితంగా, ఆరోగ్యంగా ఉన్నారని నాసా ప్రతినిధులు వెల్లడించారు. ప్రశాంత వాతావరణం వల్ల డ్రాగన్ క్యాప్సూల్ ల్యాడింగ్‌లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తలేదని అన్నారు. ల్యాండింగ్ సమయంలో భద్రతాపరంగా అమెరికా కోస్ట్‌గార్డ్ అన్ని భద్రతా చర్యలు తీసుకున్నారని వివరించారు. అన్‌డాకింగ్ నుంచి సాఫ్ట్ ల్యాండింగ్ వరకు అన్నీ అనుకున్నట్లుగానే జరిగాయని తెలిపారు. ఈ క్రమంలోనే స్పెస్ ఎక్స్ సంస్థ ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్య శక్తిని చాటిందని అన్నారు. అంతరిక్షంలోకి వెళ్లిన క్యూ-9 వ్యోమగాములు 150కి పైగా ప్రయోగాలు నిర్వహించారని పేర్కొన్నారు. క్యాన్సర్లకు పరిష్కారాలు చూపే మార్గాలపైనా పరిశోధనలు చేశారని వెల్లడించారు. వ్యోమగాముల కృషి, పరిశోధనలు రాబోయే భవిష్యత్తు తరాలకు ఎంతో ప్రయోజనకరమని నాసా తెలిపింది.

Read More..

ఇళయరాజాను కలవడం నాకు చాలా ఆనందంగా ఉంది: ఫ్రధాని మోడీ 

Tags:    

Similar News