'కౌంటింగ్ తేదీని మార్చాలి'.. ఈసీకి బీజేపీ, కాంగ్రెస్, ఎంఎన్ఎఫ్ పార్టీలు లేఖ

మిజోరంలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తేదీని మార్చాలని డిమాండ్ చేస్తూ బీజేపీ, కాంగ్రెస్‌తోపాటు అధికార ఎన్ఎన్ఎఫ్ పార్టీ ఎలక్షన్ కమిషన్(ఈసీ)కు గురువారం లేఖ రాశాయి.

Update: 2023-10-12 14:33 GMT

ఐజ్వాల్: మిజోరంలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తేదీని మార్చాలని డిమాండ్ చేస్తూ బీజేపీ, కాంగ్రెస్‌తోపాటు అధికార ఎన్ఎన్ఎఫ్ పార్టీ ఎలక్షన్ కమిషన్(ఈసీ)కు గురువారం లేఖ రాశాయి. ఎన్నికల షెడ్యూల్ ప్రకారం.. 40 స్థానాలున్న మిజోరంలో వచ్చే నెల 7న ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. దీని ఫలితాలు తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌తోపాటే డిసెంబర్ 3న వెలువడనున్నాయి. డిసెంబర్ 3న ఆదివారం అవుతుంది.

కావునా, రాష్ట్రంలో క్రైస్తవులు ఎక్కువ సంఖ్యలో ఉన్నందునా, క్రైస్తవులకు ఆదివారం పవిత్ర దినం కాబట్టి ఫలితాలు మరుసటి రోజు(డిసెంబర్ 4)న లేదా ఇంకేదైనా తేదీన వెలువరించాలని కోరుతూ రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలతోపాటు, చర్చి సంఘాలు సైతం ఈసీకి లేఖ రాశాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం, మిజోరం జనాభాలో దాదాపు 87శాతం క్రైస్తవులు ఉన్నారు. కాగా, రాజస్థాన్‌లో పెళ్లిళ్లు ఎక్కువగా ఉండటంతో అక్కడ ఎన్నికల తేదీని ఈసీ 23నుంచి 25కు మార్చిన విషయం తెలిసిందే.


Similar News