ముంబై: ‘సహారా ఇండియా పరివార్’ సంస్థ వ్యవస్థాపకులు సుబ్రతా రాయ్(75) మంగళవారం రాత్రి కన్నుమూశారు. అనారోగ్య సమస్యలతో చాలా కాలంగా ముంబైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్న ఆయన.. పరిస్థితి విషమించి మంగళవారం తుదిశ్వాస విడిచారు. అంత్యక్రియల నిమిత్తం రాయ్ భౌతికకాయాన్ని స్వస్థలం ఉత్తరప్రదేశ్లోని లక్నోకు బుధవారం తీసుకురానున్నారు. ఆయన మృతిపట్ల సమాజ్వాది పార్టీ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ట్విట్టర్ వేదికగా కుటుంబ సభ్యులకు సానుభూతి ప్రకటించింది. కాగా, ఫైనాన్స్, రియల్ ఎస్టేట్, మీడియా, ఆతిథ్యం సహా వివిధ రంగాలలో తన సామ్రాజ్యాన్ని విస్తరించిన రాయ్.. భారతీయ వ్యాపార రంగంలో ప్రముఖ వ్యక్తిగా ప్రసిద్ధి చెందారు.