Stubble burning: పంజాబ్, హర్యానా సీఎస్ లకు సమన్లు జారీ చేసిన సుప్రీం కోర్టు

పంట వ్యర్థాల దహనం విషయంలో పంజాబ్‌ (Punjab), హర్యానా (Haryana) ప్రభుత్వాలపై సుప్రీంకోర్టు (Supreme Court) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

Update: 2024-10-16 08:53 GMT

దిశ, నేషనల్ బ్యూరో: పంట వ్యర్థాల దహనం విషయంలో పంజాబ్‌ (Punjab), హర్యానా (Haryana) ప్రభుత్వాలపై సుప్రీంకోర్టు (Supreme Court) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ సమస్య పరిష్కారానికి ఆ రాష్ట్రాలు ఎలాంటి సమర్థవంతమైన చర్యలు తీసుకోవడం లేదని ఫైర్ అయ్యింది. గతంలో తాము జారీ చేసిన ఉత్తర్వులను పాటించకపోతే కోర్టు ధిక్కరణగా పరిగణించాల్సి వస్తుందని హెచ్చరించింది. ఎన్సీఆర్‌ పరిధిలో కాలుష్య నియంత్రణ కోసం కమిషన్‌ ఫర్‌ ఎయిర్‌ క్వాలిటీ మేనేజ్‌మెంట్‌ (CAQM) ఆదేశాలను ఉల్లంఘిస్తున్నారంటూ దాఖలైన పిటిషన్లపై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. నిబంధనల కట్టడిలో విఫలమైనందుకు పంజాబ్‌, హర్యానా ప్రభుత్వ అధికారులపై న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను సుప్రీంకోర్టు ఆదేశించింది. అంతేగాక.. అక్టోబరు 23న ఇరు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు వ్యక్తిగతంగా కోర్టుకు హాజరై దీనిపై వివరణ ఇవ్వాలని సమన్లు జారీ చేసింది.

పంజాబ్, హర్యానాపై ఆగ్రహం

‘‘ఇది రాజకీయ అంశం కాదు. హర్యానా దాఖలు చేసిన అఫిడవిట్‌ చూశాం. అందులో మా ఆదేశాలు పాటిస్తున్నట్లు ఎక్కడా లేదు. సీఏక్యూఎం ఆదేశాలను ఉల్లంఘించి పంట వ్యర్థాల దహనానికి (Stubble burning) పాల్పడుతున్నవారిపై పంజాబ్‌ ప్రభుత్వం గత మూడేళ్లుగా ఎలాంటి చర్యలు తీసుకోలేదు ఎందుకు?’’ అని ధర్మాససం ప్రశ్నించింది. పంట వ్యర్థాల దహనం కారణంగా ఏ ప్రాంతంలో మంటలు చెలరేగుతున్నాయో, ఎంత పరిమాణంలో ఉన్నాయో.. ఇలా అన్ని వివరాలను ఇస్రో మీకు ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తూనే ఉందన్నారు. అయినా, మంటలు చెలరేగిన ప్రాంతాలు గుర్తించలేకపోతున్నామని చెప్పడం సరికాదన్నారు. నామమాత్రంగా జరిమానాలు విధిస్తామంటే సరిపోదని.. కఠినంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఏటా 


Similar News