Breaking News : రువాండాలో వింత వ్యాధి కలకలం..15 మంది మృతి

ఆఫ్రికాలోని రువాండా(Rwanda)లో వింత వ్యాధి కలకలం రేపుతోంది.

Update: 2024-12-03 17:12 GMT

దిశ, వెబ్ డెస్క్ : ఆఫ్రికాలోని రువాండా(Rwanda)లో వింత వ్యాధి కలకలం రేపుతోంది. ప్రాణాంతక వైరస్ ‘మార్బర్గ్ వైరస్ డిసీజ్’(MVD) వలన కంటి నుంచి రక్తస్రావం జరిగి ఇప్పటికే 15 మంది మృతి చెందడం ప్రపంచాన్ని కలవరపెడుతోంది. రువాండాలో ఈ వైరస్ 66 మందికి సోకగా, నవంబర్ 29 నాటికి 15 ప్రాణాలను మృత్యువాత పడ్డారు. ఏకంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) రువాండాకు ఎవరూ ప్రయాణించవద్దని హెచ్చరించడాన్ని బట్టి ఈ వ్యాధి ఎంత తీవ్రమైనదో అర్థం చేసుకోవచ్చు. బాధితులు రక్త నాళాలపై ఈ వైరస్ దాడి చేస్తుంది కనుక దీనికి కంటిలో నుంచి రక్తస్రావం వైరస్ అనే పేరు వచ్చింది. ముక్కు, చిగుళ్లు, నోరు, యోని, చెవులు లేదా కళ్లు వివిధ ప్రదేశాల నుంచి రక్తస్రావం జరిగి, చివరికి రోగికి మరణం సంభవిస్తుంది. పండ్లను తినే గబ్బిలాల(Fruit Bats) ద్వారా మానవులకు ఎంవిడి వ్యాపిస్తుంది. ఆ తరువాత బాధిత వ్యక్తుల శారీరక ద్రవాలు తాకడం ద్వారా ఇతరులకు వ్యాపిస్తుంది. 21 రోజుల వరకు ఎటువంటి లక్షణాలూ చూపకుండానే ఒక వ్యక్తికి సోకే సామర్థ్యం ఈ వైరస్‌ను మరింత విషమం చేస్తోంది. అయితే, లక్షణాలు ఐదు నుంచి తొమ్మిది రోజుల్లోపే సాధారణంగా కనిపిస్తుంటాయి. 

Tags:    

Similar News