Kash Patel: ఎఫ్ బీఐ డైరెక్టర్ కశ్యప్ పటేల్ ని టార్గెట్ చేసిన ఇరాన్ హ్యాకర్లు
అమెరికా దర్యాప్తు సంస్థ ఎఫ్ బీఐ (FBI) డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టనున్న కశ్యప్ పటేల్ (Kash Patel)ను ఇరాన్ హ్యాకర్లు టార్గెట్ చేశారు.
దిశ, నేషనల్ బ్యూరో: అమెరికా దర్యాప్తు సంస్థ ఎఫ్ బీఐ (FBI) డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టనున్న కశ్యప్ పటేల్ (Kash Patel)ను ఇరాన్ హ్యాకర్లు టార్గెట్ చేశారు. ఈ మేరకు స్థానిక మీడియాలో కథనాలు వచ్చాయి. హ్యాకర్లు కాష్ పటేల్ కమ్యూనికేషన్స్‌లోకి చొరబడి ఉండొచ్చని నివేదిక తెలిపింది. దీనిపై ట్రంప్ అధికార బృందం ప్రతినిధి అలెక్స్ స్పందించేందుకు నిరాకరించారు. కానీ, ట్రంప్ పాలనలో కాష్ ఇరాన్‌కు వ్యతిరేకంగా కాష్ పనిచేశారన్నారు. ఎఫ్‌బీఐ డైరెక్టర్ హోదాలో ఆయన అమెరికాను సురక్షితంగా ఉంచుతారని అభిప్రాయపడ్డారు. ఈ సైబర్ దాడులపై ఎఫ్‌బీఐ ఇప్పటికే కాష్ పటేల్, ట్రంప్ బృందానికి సమాచారం అందించినట్లు అమెరికా మీడియా పేర్కొంది.
ట్రంప్ అనుచరులకు హ్యాకింగ్ ముప్పు
ఇకపోతే, ట్రంప్‌కు చెందిన కీలక న్యాయవాది, అమెరికా నూతన డిప్యూటీ అటార్నీ జనరల్‌గా నియమించిన టాడ్ బ్లాంచే సెల్‌ఫోన్‌ను గత నెల చైనా వ్యక్తులు హ్యాక్ చేశారు. కాగా, బీజింగ్ ఈ ఆరోపణలను తోసిపుచ్చింది. ఇక జూన్‌లో కూడా ట్రంప్ సహచరుడు, ప్రచార బృందంలో కీలక సభ్యుడైన రోజర్ స్టోన్ ఈమెయిల్స్‌ను ఇరాన్ బృందాలు హ్యాక్ చేశాయి. మరోవైపు, ఇటీవలే కాష్ పటేల్‌కు ఎఫ్‌బీఐ బాధ్యతలు అప్పగిస్తూ ట్రంప్ ప్రకటన చేశారు. ఇకపోతే, ట్రంప్‌కు వీరవిధేయుడిగా కాష్‌కు పేరుంది. కశ్యప్ గుజరాత్ మూలాలున్న వ్యక్తి. అతడి తల్లిదండ్రులు తూర్పు ఆఫ్రికాలో పెరిగారు. అతడి తండ్రి, యుగాండలో నియంత ఈదీ ఆమిన్ బెదిరింపుల కారణంగా అమెరికాకు వలస వచ్చారు. న్యూయార్క్‌లోని గార్డెన్ సిటీ 1980లో కశ్యప్ పుట్టాడు. యూనివర్సిటీ ఆఫ్ రిచ్‌మాండ్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. యూనివర్సిటీ కాలేజ్ లండన్‌లో న్యాయవిద్యను పూర్తి చేశాడు. ఆ తర్వాత లా సంస్థలో పని చేయాలనుకున్నా ఉద్యోగం దొరకలేదు. దీంతో, అతడు మియామీ కోర్టుల్లో పబ్లిక్ డిఫెండర్‌గా పనిచేసి వివిధ హోదాల్లో సేవలందించారు.