Sri Lanka Navy:శ్రీలంకలో 23 మంది తమిళనాడు మత్స్యకారులు అరెస్టు
శ్రీలంక నేవీ(Sri Lanka Navy) అధికారులు 23 మంది తమిళనాడు మత్స్యకారులను(Tamil Nadu fishermen) అరెస్టు చేశారు.
దిశ, నేషనల్ బ్యూరో: శ్రీలంక నేవీ(Sri Lanka Navy) అధికారులు 23 మంది తమిళనాడు మత్స్యకారులను(Tamil Nadu fishermen) అరెస్టు చేశారు. అంతర్జాతీయ సముద్ర సరిహద్దును(international maritime border) దాటినందుకు వారిని అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. శనివారం సాయంత్రం ఈ ఘటన జరిగిందని.. మూడు పడవలు స్వాధీనం చేసుకున్నామన్నారు. మత్స్యకారులు నేడుంతీవు ద్వీపం(Neduntheevu Island) సమీపంలో చేపలు పడుతుండగా.. శ్రీలంక నేవీ పెట్రోలింగ్ బోటు వారిని చుట్టుముట్టింది. అదుపులోకి తీసుకున్నవారిని కంకేసంతురై నేవల్ క్యాంప్‌కు తరలించి.. అక్కడ్నుంచి జాఫ్నా ఫిషరీస్ డిపార్ట్‌మెంట్ అధికారులకు అప్పగించనున్నారు.
గతంలో 16 మంది అరెస్టు
ఇకపోతే, అక్టోబరులో ఇదే తరహాలో రామేశ్వరానికి చెందిన 16 మంది మత్స్యకారులను శ్రీలంక నేవీ అధికారులు అరెస్టు చేశారు. సముద్ర సరిహద్దు దాటిన ఆరోపణలపై వారిని అదుపులోకి తీసుకుని, వారి పడవలను స్వాధీనం చేసుకున్నారు. తమిళనాడు మత్స్యకారులను శ్రీలంక నావికాదళం నిర్బంధించడంపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఆందోళన వ్యక్తం చేశారు. అరెస్టులపై స్పందించిన స్టాలిన్ దౌత్యపరమైన జోక్యాన్ని కోరుతూ విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్. జైశంకర్‌కు లేఖ రాశారు. తదుపరి అరెస్టులను నివారించడానికి తక్షణమే దౌత్యపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.