Udhayanidhi : నెలాఖరులోగా డిప్యూటీ సీఎంగా ఉదయనిధి ?

దిశ, నేషనల్ బ్యూరో : ఉదయనిధి స్టాలిన్ తమిళనాడు డిప్యూటీ సీఎం కాబోతున్నారా ? తాజాగా డీఎంకే ప్రభుత్వంలోని బీసీ సంక్షేమ శాఖ మంత్రి రాజా కన్నప్పన్ చేసిన వ్యాఖ్యలు అదే దిశగా సంకేతం ఇచ్చాయని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.

Update: 2024-08-09 17:18 GMT

దిశ, నేషనల్ బ్యూరో : ఉదయనిధి స్టాలిన్ తమిళనాడు డిప్యూటీ సీఎం కాబోతున్నారా ? తాజాగా డీఎంకే ప్రభుత్వంలోని బీసీ సంక్షేమ శాఖ మంత్రి రాజా కన్నప్పన్ చేసిన వ్యాఖ్యలు అదే దిశగా సంకేతం ఇచ్చాయని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. శుక్రవారం రోజు రామానంతపురంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో రాజా కన్నప్పన్ మాట్లాడుతూ ‘డిప్యూటీ సీఎం స్టాలిన్’ అని పేర్కొన్నారు. ఆ వెంటనే తాను ప్రయోగించిన పదంలో కరెక్షన్స్ చేసుకొని.. ‘‘ఆగస్టు 19 తర్వాత ఉదయనిధే డిప్యూటీ సీఎం’’ అని తెలిపారు. ఈ వ్యాఖ్యతో కుమారుడు ఉదయనిధికి డిప్యూటీ సీఎంగా పదోన్నతి కల్పించేందుకు సీఎం స్టాలిన్ సిద్ధమవుతున్నారనే ప్రచారం మరింత బలపడింది.

త్వరలోనే ఉదయనిధిని డిప్యూటీ సీఎంగా ప్రకటించి.. సీఎం స్టాలిన్ ఈనెల 22న అమెరికా పర్యటనకు బయలుదేరే అవకాశం ఉందని ఇటీవలే ఓ ప్రముఖ వార్తాసంస్థ సంచలన కథనాన్ని ప్రచురించింది. అయితే ఈ కథనాన్ని ఉదయనిధి వెంటనే ఖండించారు. 2026లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సమయానికి డీఎంకే సారథ్య బాధ్యతలను ఉదయనిధికి అప్పగించాలని సీఎం స్టాలిన్ యోచిస్తున్నారని అంటున్నారు. 

Tags:    

Similar News