Smugglers: బీఎస్ఎఫ్ జవాన్‌పై స్మగ్లర్ల దాడి.. త్రిపురలోని సెపాహిజాలా జిల్లాలో ఘటన

భారత్-బంగ్లా సరిహద్దు వెంబడి అక్రమ రవాణాను అడ్డుకు నేందుకు ప్రయత్నించిన బీఎస్ఎఫ్ హెడ్ కానిస్టేబుల్‌పై దుండగులు దాడి చేశారు.

Update: 2024-10-04 18:40 GMT

దిశ, నేషనల్ బ్యూరో: త్రిపురలోని సెపాహిజాలా జిల్లాలో భారత్-బంగ్లాదేశ్ సరిహద్దు వెంబడి అక్రమ రవాణాను అడ్డుకునేందుకు ప్రయత్నించిన బార్డర్ సెక్యురిటీ ఫోర్స్(బీఎస్ఎఫ్) హెడ్ కానిస్టేబుల్‌పై దుండగులు దాడి చేశారు. బోజానగర్ ప్రాంతంలో జరిగిన ఈ ఘటనలో హెడ్ కానిస్టేబుల్ హరీష్ చంద్ర పాండే తలకు తీవ్ర గాయమైనట్టు త్రిపురలోని బీఎస్ఎఫ్ అధికార ప్రతినిధి తెలిపారు. కల్సిమురా బోర్డర్ అవుట్ పోస్ట్ వద్ద నిషేధిత పదార్థాలను స్మగ్లింగ్ చేయకుండా అడ్డుకునేందుకు ప్రయత్నించగా కొందరు గొడవకు దిగినట్టు తెలిపారు. ఈ క్రమంలోనే పాండేపై పదునైన ఆయుధంతో దాడి చేయగా తీవ్ర గాయాలయ్యయని వెల్లడించారు. అనంతరం దుండగులు అక్కడి నుంచి పారిపోయారని పేర్కొ్న్నారు. ఈ ఘటనపై స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్టు బీఎస్ఎఫ్ తెలిపింది. కాగా, ఈ ఏడాది మార్చిలోనూ ఉనకోటి జిల్లాలో జరిగిన ఘర్షణలో బంగ్లాదేశ్ స్మగ్లర్ మరణించగా, ఇద్దరు బీఎస్ఎఫ్ సిబ్బంది గాయపడ్డారు.


Similar News