ఇది రొమాంటిక్ క్రైమ్ కథా చిత్రమేనా? డ్యామ్‌లో తగ్గిన నీరు.. బయటపడ్డ కారు.. అస్థిపంజరాలు..

మధ్యప్రదేశ్‌లో ఓ ఆశ్చర్య ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఒక డ్యామ్‌లో నీరు తగ్గిపోవడంతో ఒక కారు.. అందులో రెండు అస్థిపంజరాలు కనిపించాయి.

Update: 2024-06-20 06:25 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: మధ్యప్రదేశ్‌లో ఓ ఆశ్చర్య ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఒక డ్యామ్‌లో నీరు తగ్గిపోవడంతో ఒక కారు.. అందులో రెండు అస్థిపంజరాలు కనిపించాయి. దీంతో అక్కడ ఉన్న వారు షాక్‌కు గురయ్యారు. పోలీసుల విచారణలో అవి దగ్గర ఊరిలోని వ్యక్తులవి అని గుర్తించారు. ఇది హత్య, ప్రమాదమా అన్న కోణంలో విచారణ జరుపుతున్నారు. మధ్యప్రదేశ్‌‌లని కువారి నదిపై గోపి గ్రామ సమీపంలో నిర్మించిన స్టాప్ డ్యామ్‌ నిర్వాహణలో భాగంగా డ్యామ్ గేట్లు తెరిచారు. నీరు తగ్గుముఖం పట్టడంతో అందులో ఒక కారు బయటపడింది. అయితే, ఆ కారులో ఒక అబ్బాయి, ఒక మహిళ అస్థిపంజరాలు ఉన్నాయి.

సమాచారం అందుకున్న సిహోనియా పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులు ఆరాతీయగా దొరికిన అస్థిపంజరాలు అంబాహ్‌ గ్రామానికి చెందిన అబ్బాయి నీరజ్(26), చట్కా పురా నివాసి ముఖేష్ జాతవ్ భార్య మిథిలేష్ (32)గా గుర్తించారు. వివాహిత మిథిలేష్ తప్పిపోయినట్టుగా తన భర్త ఫిబ్రవరిలో ఫిర్యాదు చేయగా, అబ్బాయి నీరజ్ మిస్సింగ్‌పై ఎలాంటి ఫిర్యాదు రాకపోవడంతో అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇద్దరు ప్రేమించుకొని సూసైడ్ చేసుకున్నారా లేక కుటుంబ సభ్యులు చంపి నదిలో వేశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇది రొమాంటిక్ క్రైమ్ కథా చిత్రమేనా?? అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.

Tags:    

Similar News