ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులకు మరో ఎదురు దెబ్బ.. బాంబ్ బ్లాస్ట్‌లో పాల్గొన్న ఆరుగురు కీలక వ్యక్తులు అరెస్ట్

ఛత్తీస్‌గఢ్‌లో జరుగుతోన్న వరుస ఎన్ కౌంటర్లలో కీలక వ్యక్తులను కోల్పోతున్న మావోయిస్టు పార్టీకి తాజాగా మరో ఎదురు దెబ్బ తగిలింది.

Update: 2024-06-26 14:40 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఛత్తీస్‌గఢ్‌లో జరుగుతోన్న వరుస ఎన్ కౌంటర్లలో కీలక వ్యక్తులను కోల్పోతున్న మావోయిస్టు పార్టీకి తాజాగా మరో ఎదురు దెబ్బ తగిలింది. ఛత్తీస్‌గఢ్‌లో తాజాగా ఆరుగురు మావోయిస్టులను పోలీసులు అరెస్ట్ చేశారు. మావోయిస్టులు ఉన్నారన్న పక్క సమాచారం తెలుసుకున్న సుకుమా జిల్లా పోలీసులు బుధవారం ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుండి పెద్ద మొత్తంలో పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

తాజాగా అరెస్ట్ చేసిన ఆరుగురు మావోయిస్టులను ఈ నెల 23న టేకల్‌గూడ అటవీ ప్రాంతంలో ఐఈడీ పేల్చి ఇద్దరు జవాన్ల మృతికి కారణమైన వారీగా పోలీసులు గుర్తించారు. కాగా, టేకల్‌గూడ ఫారెస్ట్ ఏరియాలో పోలీసులు ప్రయాణిస్తోన్న వాహనాన్ని మందు పాతరతో మావోయిస్టులు పేల్చిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఇద్దరు జవాన్లు మృతి చెందగా.. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న పోలీసులు.. తాజాగా ఆరుగురు మావోయిస్టులను అరెస్ట్ చేశారు. 


Similar News