సీజేఐ చంద్రచూడ్ బెంచ్‌లో కూర్చున్న సింగపూర్ సీజే
తొలిసారిగా సుప్రీంకోర్టు ఆవిర్భావ వేడుకలను నిర్వహించనున్న నేపథ్యంలో ముఖ్య అతిథి సింగపూర్ సీజే సుందరేశ్ మీనన్ భారత్ లో పర్యటించారు.
న్యూఢిల్లీ: తొలిసారిగా సుప్రీంకోర్టు ఆవిర్భావ వేడుకలను నిర్వహించనున్న నేపథ్యంలో ముఖ్య అతిథి సింగపూర్ సీజే సుందరేశ్ మీనన్ భారత్ లో పర్యటించారు. శుక్రవారం సుప్రీంకోర్టు సీజేఐ డీవై చంద్రచూడ్ బెంచ్‌తో కలిసి కూర్చుకున్నారు. శనివారం సుప్రీంకోర్టు ఆవిర్భావ వేడుకలను జరుపుకోనున్న సంగతి తెలిసిందే. సింగపూర్ సీజే మీనన్ ప్రపంచ మార్పులో న్యాయ వ్యవస్థ పాత్ర అనే అంశంపై ఆయన ప్రసంగించనున్నారు. సింగపూర్ నాలుగో సీజే అయిన మీనన్ 2012 నుంచి బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
కాగా, తొలిసారిగా డీవై చంద్రచూడ్ చొరవతో సుప్రీంకోర్టు ఆవిర్భావ వేడుకలకు సిద్ధమైంది. ఈ కార్యక్రమానికి సీజేఐ, హైకోర్టుల సీనియర్, మాజీ న్యాయమూర్తులు, ప్రభుత్వ సీనియర్ అధికారులు, బార్ అసోసియేషన్ సభ్యులు, సీనియర్ న్యాయవాదులు, అత్యున్నత న్యాయస్థానం అధికారులు, సిబ్బందితో పాటు పలువురు ప్రముఖులు హాజరుకానున్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు.