Muda Scam: సిద్ధరామయ్యే కర్ణాటక ముఖ్యమంత్రి: డీకే శివకుమార్

కర్ణాటకలో సంచలనం సృష్టించిన ముడా కుంభకోణం కేసులో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన పదవికి రాజీనామా చేయాలంటూ బీజేపీ డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఆయనకు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మద్దతుగా నిలిచారు.

Update: 2024-08-20 13:23 GMT

దిశ, నేషనల్ బ్యూరో: కర్ణాటకలో సంచలనం సృష్టించిన ముడా కుంభకోణం కేసులో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన పదవికి రాజీనామా చేయాలంటూ బీజేపీ డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఆయనకు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మద్దతుగా నిలిచారు. బీజేపీ, సీఎం సిద్ధరామయ్యపై తప్పుడు ఆరోపణలు చేస్తుందని, ఆయన ప్రజాదరణను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తోందని అన్నారు. ముఖ్యమంత్రి పదవి నుంచి సిద్ధరామయ్య తప్పుకునే ప్రశ్నే లేదు. ఆయన తన పదవిలో కొనసాగుతారు, కర్ణాటక ప్రజల కోసం పనిచేస్తారని డీకే చెప్పారు. న్యాయవ్యవస్థపై పూర్తి నమ్మకం ఉంది, సిద్ధరామయ్యకు కోర్టు పూర్తి ఉపశమనం కలిగిస్తుంది, మేము కోర్టును, దేశ చట్టాన్ని గౌరవిస్తాము. ఈ కేసులో సీఎంకు ఎలాంటి సంబంధం లేదు. ఆయన్ను విచారించాల్సిన అవసరం లేదని డీకే అన్నారు. అలాగే, సీఎం పదవి కోసం తాను ఆరాటపడుతున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.

ఇదిలా ఉంటే సిద్ధరామయ్య ఎక్స్ పోస్ట్‌లో వ్యాఖ్యానిస్తూ, రాజ్యాంగంపై విశ్వాసం ఉంది. చట్టాన్ని గౌరవించే పౌరుడిగా, మోసపూరిత ఆరోపణలతో కర్ణాటక గవర్నర్ విచారణకు ఆదేశించడం అనే చట్టవిరుద్ధమైన రాజకీయ ప్రేరేపిత నిర్ణయానికి వ్యతిరేకంగా కర్ణాటక హైకోర్టును ఆశ్రయించాను. సత్యమే గెలుస్తుందని అన్నారు. మరోవైపు ఈ కేసులో ఆగస్టు 29 వరకు ఆయనను విచారించవద్దని కోర్టు ఆదేశించింది.

Tags:    

Similar News