ముంబైలో షాకింగ్ ఘటన!.. ఐస్ క్రీమ్ లో మనిషి వేలు

సాధరణంగా ఆన్ లైన్ లో ఆర్డర్ చేసిన ఫుడ్ లో చిన్న చిన్న పురుగులు లేదా పాడైన ఆహారం వచ్చిందని కంప్లైంట్ చేయడం చూస్తుంటాం.

Update: 2024-06-13 08:09 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: సాధరణంగా ఆన్ లైన్ లో ఆర్డర్ చేసిన ఫుడ్ లో చిన్న చిన్న పురుగులు లేదా పాడైన ఆహారం వచ్చిందని కంప్లైంట్ చేయడం చూస్తుంటాం. కానీ ముంబైలో ఓ మహిళ డాక్టర్ ఐస్ క్రీం ఆర్డర్ చేస్తే మనిషి చేతి వేలు దర్శనం ఇచ్చింది. ముంబై లోని మలాడ్ ప్రాంతానికి చెందిన డాక్టర్ ఓర్లెమ్ బ్రెండన్ సెర్రావో తన సోదరితో కలిసి ఐస్ క్రీం తినాలి అని 3 కోన్ ఐస్ క్రీంలను ఆన్ లైన్ లో ఆర్డర్ పెట్టింది. వారు ఆర్డర్ పెట్టిన ది యుమ్మో బటర్ స్కాచ్ ఫ్లేవర్ ఐస్ క్రీంలను ఆన్ లైన్ డెలివరీ సంస్థ ఇంటికి డెలివరీ చేసింది.

దానిని తినడం ప్రారంభించిన కొద్దిసేపటికి నోటికి ఏదో తగిలినట్టుగా అనిపించింది. వెంటనే పరీక్షించి చూడటంతో కోన్ ఐస్ క్రీంలో 2 అంగులాల మనిషి వేలు బయటపడింది. దీన్ని చూసి ఖంగు తిన్న ఆ మహిళ డాక్టర్ నేరుగా మలాడ్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై యుమ్మో ఐస్ క్రీం అనే సంస్థపై కేసు నమోదు చేసిన పోలీసులు ఆ వేలును ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించారు. దీనిపై వెంటనే ధర్యాప్తు చేపడతామని, యుమ్మో ఐస్ క్రీం తయారు చేసే ఫ్యాక్టరీని కూడా సందర్శించి తనిఖీలు చేపడతామని పోలీస్ ఉన్నతాధికారులు వెల్లడించారు.



Similar News