Shinde: ‘మహాయుతి’ కూటమిదే అధికారం.. సీఎం ఏక్‌నాథ్ షిండే

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల అనంతరం మహాయుతి కూటమి ప్రభుత్వాన్నిఏర్పాటు చేస్తుందని సీఎం షిండే దీమా వ్యక్తం చేశారు.

Update: 2024-10-19 15:17 GMT

దిశ, నేషనల్ బ్యూరో: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల అనంతరం మహాయుతి కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఆ రాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే దీమా వ్యక్తం చేశారు. త్వరలోనే కూటమిలోని భాగస్వామ్య పార్టీల మధ్య సీట్ల పంపకం పూర్తవుతుందని తెలిపారు. శనివారం ఆయన ఓ మీడియా చానల్‌తో మాట్లాడారు. ఇప్పటికే సీట్ షేరింగ్‌పై చర్చలు జరిగాయని మరో 35 సీట్లపై క్లారిటీ రావాల్సి ఉందన్నారు. సీట్ల పంపకం విషయంలో ఎలాంటి విభేదాలూ లేవని స్పష్టం చేశారు. మహాయుతి అలయెన్స్‌ను మరోసారి అధికారంలోకి తీసుకురావాలని కోరుకుంటున్నామని, దానిపై పూర్తి నమ్మకం ఉందని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు మరాఠా రిజర్వేషన్ కార్యకర్త మనోజ్ జరంగే-పాటిల్ చేసిన వ్యాఖ్యలపై షిండే స్పందించారు. ప్రజాస్వామ్యంలో, ప్రతి ఒక్కరికీ ఎన్నికల్లో పోటీ చేసే హక్కు ఉందని, వారి శక్తి మేరకు ఆ హక్కును వినియోగించుకోవచ్చని స్పష్టం చేశారు. కాగా, రాష్ట్రంలోని అధికార మహాయుతి కూటమిలో బీజేపీ, శివసేన, ఎన్సీపీ అజిత్ పవార్ వర్గం పార్టీలు భాగస్వామిగా ఉన్నాయి. 288 అసెంబ్లీ స్థానాలున్న మహారాష్ట్రలో వచ్చే నెల 20న ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే.


Similar News