అమృతపాల్ సింగ్ నోట మళ్లీ 'ఖలిస్తాన్' మాట

ప్రమాణం అయిన ఒకరోజు తర్వాత తన తల్లి వ్యాఖ్యలపై స్పందించారు.

Update: 2024-07-07 14:45 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఖలిస్తాని వేర్పాటువాది, ఇటీవల జైలు నుంచే ఎంపీగా గెలిచిన అమృతపాల్ సింగ్ మరోసారి ఖలిస్తాన్ డిమాండ్‌పై మాట్లాడారు. ఈ సందర్భంగా తన తల్లి చేసిన వ్యాఖ్యలను ఖండించారు. 'తన కొడుకు ఖలిస్తాన్ మద్దతుదారు కాదని, అతన్ని విడుదల చేయాలని' అమృతపాల్ సింగ్ కోరిన సంగతి తెలిసిందే. ఎంపీగా ప్రమాణస్వీకారం చేసేందుకు పెరోల్‌పై వచ్చిన అమృతపాల్ సింగ్ ప్రమాణం అయిన ఒకరోజు తర్వాత తన తల్లి వ్యాఖ్యలపై స్పందించారు. ఖల్సా రాష్ట్రం గురించి కలలు కనడం నేరమేమీ కాదు. అయితే, మా అమ్మ చేసిన వ్యాఖ్యలు కొంత బాధించాయి. అనుకోని సందర్భంలో తను అలాంటి వ్యాఖ్యలు చేసిందని భావిస్తున్నాను. ఇలాంటి ప్రకటన తన కుటుంబం, మద్దతిచ్చే వారి నుంచి రాకూడదు' అని అన్నారు. ఖల్సా రాష్ట్రం గురించి కలలు కనడం గర్వించదగ్గ విషయం. లక్షలాది మంది సిక్కులు తమ జీవితాలను త్యాగం చేసిన మార్గం నుంచి వెనక్కి తగ్గడమనేది కలలో కూడా ఊహించలేమని అమృతపాల్ తెలిపారు. దేశ వ్యతిరేక కార్యకలాపాల కేసులో, యూఏపీఏ చట్టం కింద అస్సాంలోని దిబ్రూగఢ్ జైలులో ఉన్న అమృత్‌పాల్ సింగ్ ఎంపీగా ప్రమాణస్వీకారం కోసం నాలుగు రోజుల పెరోల్‌తో విడుదలయ్యారు. జూలై 5న ఆయనతో పాటు ఇంజనీరి రషీద్ అని పిలువబడే షేక్ అబ్దుల్ రషీద్ ఎంపీలుగా ప్రమాణం చేశారు.  


Similar News