చరిత్ర సృష్టించిన స్టాక్ మార్కెట్లు.. తొలిసారిగా 80 వేల దగ్గర సెన్సెక్స్

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు కొత్త రికార్డుని నెలకొల్పాయి. ట్రేడింగ్ మొదలవ్వగానే రెండు ప్రధానసూచీలు రికార్డు గరిష్ఠాలనుతాకాయి.

Update: 2024-07-03 05:17 GMT

దిశ, నేషనల్ బ్యూరో: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు కొత్త రికార్డుని నెలకొల్పాయి. ట్రేడింగ్ మొదలవ్వగానే రెండు ప్రధానసూచీలు రికార్డు గరిష్ఠాలనుతాకాయి. 79,787 దగ్గర సెన్సెక్స్‌, 24,209 వద్ద నిఫ్టీ ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. సెన్సెక్స్ 80 వేల జీవనకాల గరిష్ఠాన్ని నమోదు చేసింది. 80,074 వద్ద సరికొత్త రికార్డు నెలకొల్పింది. నిఫ్టీ 24,296 దగ్గర తాజా జీవనకాల గరిష్ఠాన్ని నమోదుచేసింది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.83.53 వద్ద ప్రారంభమైంది.

లాభాల్లో హెచ్ డీఎఫ్ సీ షేర్లు

బ్యాంకింగ్ సెక్టార్ లలో లాభాలు మొదలయ్యాయి. హెచ్ డీఎఫ్ సీ బ్యాంకు రికార్డు స్థాయిలో లాభాలు గడించింది. సెన్సెక్స్‌-30 సూచీలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌ ఐసీఐసీఐ బ్యాంక్‌, కోటక్ మహీంద్రా బ్యాంక్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, నెస్లే ఇండియా, ఎం అండ్‌ ఎం, ఐటీసీ, బజాజ్‌ ఫైనాన్స్‌, టాటా స్టీల్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ షేర్లు లాభాల్లో ఉన్నాయి. టీసీఎస్‌, టాటా మోటార్స్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, పవర్‌గ్రిడ్‌, రిలయన్స్, టైటన్‌, మారుతీ, ఇన్ఫోసిస్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌ నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇకపోతే, అమెరికా మార్కెట్లు మంగళవారం లాభాలతో ముగిశాయి. దీంతో, ఆసియా సూచీలూ సానుకూలంగా ట్రేడవుతున్నాయి. మరోవైపు, అంతర్జాతీయ మార్కెట్‌లో బ్యారెల్‌ బ్రెంట్‌ చమురు ధర 86.72 డాలర్ల వద్ద కొనసాగుతోంది.


Similar News