మహారాష్ట్ర కేబినెట్ సంచలన నిర్ణయం.. రతన్ టాటాకు భారత రత్న ఇవ్వాలని కేంద్రానికి వినతి

భారత ప్రముఖ వ్యాపార వెత్త టాటా ఇండస్ట్రీస్ అధినేత రతన్ టాటా బుధవారం రాత్రి 11.30 గంటలకు అనారోగ్యంతో కన్నుమూశారు.

Update: 2024-10-10 07:38 GMT

దిశ, వెబ్‌డెస్క్: భారత ప్రముఖ వ్యాపార వెత్త టాటా ఇండస్ట్రీస్ అధినేత రతన్ టాటా బుధవారం రాత్రి 11.30 గంటలకు అనారోగ్యంతో కన్నుమూశారు. కాగా ఆయన మృతిపై మహారాష్ట్ర ప్రభుత్వం నేడు రాష్ట్ర వ్యాప్తంగా సంతాప దినంగా ప్రకటించింది. అలాగే రతన్ టాటా అంతిమ సంస్కారాలను పూర్తి ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహిస్తామని ప్రకటించింది. మధ్యాహ్నం మహారాష్ట్ర కేబినెట్ అత్యవసర సమావేశం నిర్వహించి.. రతన్ టాటా మృతికి సంతాపం ప్రకటించింది. అలాగే రతన్ టాటా దేశానికి ఎంతో సేవ చేశాడని.. ఆయన అత్యున్నత పౌర పురస్కారం అయిన భారత రత్న ప్రదానం చేయాలని.. కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయాలని మహారాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది.

 


Similar News