Kolkata Horror Protests: ప్రతి రెండుగంటలకొకసారి నివేదికలు పంపాలి

కోల్‌కతా ట్రైనీ డాక్టర్‌ హత్య, అత్యాచారం ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటి నేపథ్యంలో హోంమంత్రిత్వశాఖ అన్ని రాష్ట్రాలకు కీలక ఆదేశాలు జారీ చేసింది.

Update: 2024-08-18 05:14 GMT

దిశ, నేషనల్ బ్యూరో: కోల్‌కతా ట్రైనీ డాక్టర్‌ హత్య, అత్యాచారం ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటి నేపథ్యంలో హోంమంత్రిత్వశాఖ అన్ని రాష్ట్రాలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రతి రెండు గంటలకు శాంతిభద్రతల పరిస్థితిపై నివేదికలు సమర్పించాలని పేర్కొంది. అన్ని రాష్ట్రాల పోలీసు బలగాలు ప్రతి రెండు గంటలకు మెయిల్, ఫ్యాక్స్ లేదా వాట్సాప్ ద్వారా నివేదికలు పంపాలని హోం మంత్రిత్వ శాఖ ఆదేశించింది. శాంతిభద్రతలను నిరంతరం పర్యవేక్షించాలని కోరింది. నివేదికలను హోంమంత్రిత్వశాఖ కంట్రోల్ పంపాలని ఆదేశించింది. ప్రతి రెండు గంటలకొకసారి నివేదికలు పంపడం వల్ల వాటి ఆధారంగా పరిస్థితులను అంచనా వేసి తగిన చర్యలు తీసుకుంటామని పేర్కొంది. కోల్‌కతా అత్యాచారం కేసులో అనేక లోపాలు బయటపడ్డాయని, అధికారుల నుంచి మద్దతు లేకపోవడం, పోలీసులు నిందితుడికి సహకరిస్తున్నారనే ఆరోపణలతో కేసుని సీబీఐకి అప్పగించిందని తెలిపింది. ఇలాంటి కీలకమైన సందర్భాల్లో వేగంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు.

ఎంహెచ్ఏ కీలకమైన చర్యలు

అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో భద్రతా పరిస్థితులపై నిఘా ఉంచేందుకు ఎంహెచ్ఏ భద్రతాపరిస్థితులపై నిఘా ఉంచేందుకు ఈ కీలకమైన చర్య తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. కోల్ కతా ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్ లో ఆగస్టు 9న మెడికో విద్యార్థి అత్యాచారం, హత్య జరిగింది. దీంతో దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. కేసులో లోపాలు బయటపడతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫలితంగా కలకత్తా హైకోర్టు కేసుని సీబీఐకి బదిలీ చేసింది.


Similar News