పార్లమెంటు సేన కార్యాలయం షిండే వర్గానికి కేటాయింపు
ఈసీ షిండే శివసేనకు గుర్తుల కేటాయింపుల నేపథ్యంలో లోక్ సభ సెక్రటేరియట్ కీలక నిర్ణయం తీసుకున్నారు..
న్యూఢిల్లీ: ఈసీ షిండే శివసేనకు గుర్తుల కేటాయింపుల నేపథ్యంలో లోక్ సభ సెక్రటేరియట్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తాజాగా పార్లమెంటులో శివసేన కార్యాలయాన్ని షిండే వర్గానికి కేటాయించినట్లు లోక్ సభ సెక్రటేరియట్ తెలిపారు. షిండే వర్గానికి చెందిన ఫ్లోర్ లీడర్ రాహుల్ షెవాలే రాసిన లేఖపై లోక్‌సభ సెక్రటేరియట్ స్పందిస్తూ, పార్లమెంటు భవనంలోని సేన కార్యాలయం కోసం కేటాయించిన గదిని పార్టీకి కేటాయించినట్లు వెల్లడించారు.
గత వారం ఎన్నికల కమిషన్ శివసేన పార్టీ పేరును, గుర్తును షిండే వర్గానికి కేటాయించిన సంగతి తెలిసిందే. ఆ మరుసటి రోజే షిండే వర్గం నేత లోక్ సభ కు లేఖ రాసినట్లు పేర్కొంది. షిండే వర్గం జాతీయ కార్యవర్గ సమావేశాన్ని చేపట్టనున్నట్లు తెలిపిన తర్వాత ఈ ప్రకటన రావడం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు ఈసీ నిర్ణయాన్ని సవాలు చేస్తూ థాక్రే వర్గం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.