మంకీపాక్స్‌ కలకలం.. భారత్‌లో రెండో కేసు నమోదు

కరోనా అనంతరం ప్రపంచ దేశాలను వణికిస్తున్న వైరస్‌లలో మంకీపాక్స్ చోటు దక్కించుకుంది.

Update: 2024-09-18 13:37 GMT

దిశ, వెబ్‌డెస్క్: కరోనా అనంతరం ప్రపంచ దేశాలను వణికిస్తున్న వైరస్‌లలో మంకీపాక్స్ చోటు దక్కించుకుంది. ఆఫ్రికా దేశాల్లో ఈ వైరస్ కారణంగా అత్యధిక సంఖ్యలో మరణాలు చోటు చేసుకోగా.. ప్రస్తుతం భారత్ లో కూడా ఈ వైరస్ ప్రవేశించింది. ఇప్పటికే ఈ మంకీ పాక్స్ రెండో కేసు దేశంలో నమోదైంది. దుబాయ్‌ నుంచి కేరళ వచ్చిన వ్యక్తికి ఎంపాక్స్‌ గుర్తించినట్లు అధికారులు ప్రకటించారు. కాగా 9 రోజుల క్రితం ఢిల్లీలో తొలి ఎంపాక్స్‌ కేసు నమోదు కాగా ప్రస్తుతం కేరళలో రెండో మంకీపాక్స్‌ కేసు నమోదైంది. దీంతో అప్రమత్తమైన అధికారులు మంకీపాక్స్‌ పాజిటీవ్ వచ్చిన వ్యక్తిని వెంటనే ప్రత్యేగంగా ఏర్పాటు చేసిన వార్డుకు తరలించారు. 

లక్షణాలు

ఈ వైరస్‌ సోకిన వ్యక్తుల్లో జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పులు, వెన్నునొప్పి తీవ్రంగా ఉంటాయి. అలాగే గ్రంథుల్లో వాపు వంటివి కనిపిస్తాయి. రెండు నుంచి మూడు వారాల్లో శరీరం అంతటా దద్దుర్లు, బొబ్బలు కనిపిస్తాయి.. ముఖ్యంగా ఈ దద్దుర్లు ముఖం, అర చేతులు, పాదాల అరికాళ్లు, కళ్ళు, నోరు, గొంతు, గజ్జలు, జననేంద్రియాలు ప్రాంతాల్లో కూడా కనిపిస్తాయి అని వైద్య నిపుణులు తెలుపుతున్నారు.


Similar News