ఢిల్లీలోని కూలిన పాఠశాల గోడ.. పలు కార్ల ధ్వంసం

ఢిల్లీలో ఆదివారం మధ్యాహ్నం ఓ ప్రభుత్వ పాఠశాల గోడ కూలి పలు వాహనాలు ధ్వంసమయ్యాయి.

Update: 2024-08-11 16:38 GMT

దిశ, వెబ్ డెస్క్ : ఢిల్లీలో ఆదివారం మధ్యాహ్నం ఓ ప్రభుత్వ పాఠశాల గోడ కూలి పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. గత కొద్దిరోజులుగా ఢిల్లీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల ధాటికి బాగా నాని ఉన్న న్యూ అశోక్ నగర్లోని ప్రభుత్వ పాఠశాల గోడ కూలి పక్కనే పార్క్ చేసి ఉంచిన వాహనాల మీద పడింది. ప్రమాద దాటికి 6 కార్లు, రెండు అంబులెన్సులు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. ప్రత్యక్ష సాక్షి ప్రేమ్ చంద్ అనే వ్యక్తి చెప్పిన వివరాల ప్రకారం.. "ఆదివారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో వర్షానికి బాగా తడిసి పోయిన పాఠశాల గోడ ఒక్కసారిగా కూలిపోయి పక్కనే ఉన్న కార్లు, అంబులెన్సుల మీద పడింది" అని వెల్లడించాడు. ఆదివారం పాఠశాలలకు సెలవు కావడంతో పెను ప్రమాదం తప్పిందని, లేదంటే పిల్లలు బలయ్యేవారని స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ఘటనా స్టాలనికి చేరుకొని, శిథిలాల తొలగింపు ప్రక్రియ చేపట్టారు. కాగా వారం నుండి ఉత్తరాదిలో కురుస్తున్న కుండపోత వర్షాలకు పలు రాష్ట్రాలు జలమయమయ్యాయి.


Similar News