Wayanad landslides: రెస్క్యూ ఆపరేషన్ లో సూపర్ స్టార్ మోహన్ లాల్

వయనాడ్‌ రెస్య్కూ ఆపరేషన్ లో స్టార్ హీరో మోహన్ లాల్ పాల్గొనేందుకు ముందుకొచ్చారు. టెరిటోరియల్‌ ఆర్మీ బేస్‌ క్యాంపునకు ఆయన చేరుకున్నారు.

Update: 2024-08-03 06:43 GMT

దిశ నేషనల్ బ్యూరో: వయనాడ్‌ రెస్య్కూ ఆపరేషన్ లో స్టార్ హీరో మోహన్ లాల్ పాల్గొనేందుకు ముందుకొచ్చారు. టెరిటోరియల్‌ ఆర్మీ బేస్‌ క్యాంపునకు ఆయన చేరుకున్నారు. టెరిటోరియల్‌ ఆర్మీలో లెఫ్టినెంట్‌ కల్నల్‌గా ఉన్న మోహన్‌లాల్‌.. విపత్తు ప్రాంతాన్ని సందర్శించి సైనికులతో సమావేశం కానున్నారు. కోజికోడ్‌ నుంచి రోడ్‌ మార్గంలో వయనాడ్‌కు వెళ్లి ఆర్మీ అధికారులతో చర్చలు జరిపారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్‌ మీడియాలో షేర్‌ అవుతున్నాయి. మోహన్ లాల్ పై అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.

అంతకంతకు పెరుగుతున్న మృతుల సంఖ్య

వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడిన ఘటనలో (Wayanad landslides) మృతి చెందిన వారి సంఖ్య 358కి చేరుకుంది. ఈ క్రమంలో బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు దేశవ్యాప్తంగా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ముందుకువస్తున్నారు. ఇప్పటికే పలువురు నటులు సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు భారీ విరాళాలు ఇచ్చారు. కమల్ హాసన్, నయనతార సహా పలువురు సెలబ్రిటీలు విరాళాలు అందించారు. ఈ విపత్తులో వందలాది మంది గల్లంతయ్యారు. వారి ఆచూకీ కోసం డ్రోన్లు, రాడార్లు,మొబైల్ సిగ్నల్స్ ద్వారా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు.


Similar News