శరద్ పవార్ ఎన్సీపీ రెబల్స్ అనర్హతపై 13న సుప్రీం విచారణ

Update: 2023-10-09 13:27 GMT

న్యూఢిల్లీ : తన మేనల్లుడు అజిత్ పవార్ నేతృత్వంలో తిరుగుబాటు చేసిన 40 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ వర్గం దాఖలు చేసిన పిటిషన్‌‌ను ఈనెల 13న విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. అజిత్ పవార్‌ వెంట వెళ్లిపోయిన ఎన్సీపీ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ రాహుల్ నార్వేకర్‌ను ఆదేశించాలని ఈ పిటిషన్‌లో శరద్ పవార్ వర్గం కోరింది.

‘‘40 మంది ఎన్సీపీ తిరుగుబాటు ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలంటూ జూలై 2న మేం అసెంబ్లీ స్పీకర్‌కు అనర్హత పిటిషన్‌‌ను ఇచ్చాం. మూడు నెలలు గడుస్తున్నా ఆయన నుంచి స్పందన రాలేదు. దీంతో మేం సుప్రీంకోర్టును ఆశ్రయించాం’’ అని శరద్ పవార్ అండ్ టీమ్ తెలిపింది. మహారాష్ట్ర ఎన్సీపీ అధ్యక్షుడు జయంత్ పాటిల్ సెప్టెంబర్ 24న సుప్రీంకోర్టులో ఈ రిట్ పిటిషన్‌ను దాఖలు చేశారు.

Tags:    

Similar News