జైళ్లలో కులవివక్షపై పిల్.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు

జైళ్లలో ఉన్న ఖైదీల పట్ల కులవివక్ష చూపడాన్ని సుప్రీం ధర్మాసనం తీవ్రంగా తప్పుపట్టింది. జైళ్లో ఉన్న మాన్యువల్ రూల్స్ ను వెంటనే తొలగించాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించింది.

Update: 2024-10-03 07:00 GMT

దిశ, వెబ్ డెస్క్: వివిధ కేసుల్లో నిందితులుగా నిర్థారణై.. జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న ఖైదీల పట్ల కుల వివక్ష చూపుతున్నారని, చేసే పనుల్లో విభజన చూపిస్తున్నారని ఆరోపిస్తూ.. సుప్రీంకోర్టు (Supreme Court)లో దాఖలైన పిల్ పై న్యాయస్థానం విచారణ చేపట్టింది. ఖైదీల పట్ల కులవివక్ష జరుగుతోందని తేలడంతో.. సుప్రీం ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఖైదీలను కులాల ఆధారంగా వేరుచేసి చూడటాన్ని తీవ్రంగా తప్పుపట్టింది.

శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు ఏ కులస్తులైనా సరే.. వారిని మనుషులుగానే చూడాలని, జైళ్లలో ఉన్నవారిలో ఎవరూ చట్టానికి అతీతులు కాదని తెలిపింది. పని విషయంలో అందరినీ సమానంగా చూడాలని తీర్పు చెప్పింది. అలాగే ప్రమాదకర పరిస్థితుల్లో సీవేజ్ ట్యాంకులను ఖైదీల చేత శుభ్రం చేయించరాదని పేర్కొంది. జైళ్లలో ఉన్న అభ్యంతరకర రూల్స్ ను కోర్టు కొట్టిపారేసింది. ఒక కులానికి చెందిన వ్యక్తులనే స్వీపర్లుగా ఎంపిక చేయడం కూడా సరైన పద్ధతి కాదని, ఖైదీలు ఏ కులానికి చెందినవారైనా సరే.. పనులను సమానంగా అప్పజెప్పాలని సుప్రీం ధర్మాసనం జైళ్లశాఖ అధికారులకు సూచించింది. 


Similar News