'సనాతన ధర్మం హెచ్ఐవీ లాంటిది'.. డీఎంకే నేత వివాదాస్పద వ్యాఖ్యలు

డీఎంకే సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి ఎ. రాజా సనాతన ధర్మంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

Update: 2023-09-07 12:50 GMT

చెన్నై: డీఎంకే సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి ఎ. రాజా సనాతన ధర్మంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇంతకుముందు ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మాన్ని మలేరియా, డెంగీ వ్యాధులతో పోల్చగా.. ఇప్పుడు ఎ. రాజా సనాతన ధర్మం హెచ్ఐవీ, కుష్టు వ్యాధుల లాంటిదని కామెంట్ చేశారు. ‘‘సనాతన ధర్మం సామాజిక దురాగత వ్యాధి లాంటిది. హెచ్ఐవీ కన్నా ప్రమాదకరమైన జబ్బు అది’’ అని పేర్కొన్నారు. రాజా కామెంట్స్‌పై బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాల్వియా ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు.

దేశంలోని 80% మంది అనుసరించే ధర్మాన్ని, మతాన్ని డీఎంకే నేతలు కించపరుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది ముమ్మాటికీ మత విద్వేష ప్రసంగమేనని ఆరోపించారు. కాంగ్రెస్‌తో కూడిన విపక్ష కూటమిలోని పార్టీలు హిందూ మతాన్ని అనుసరించే వాళ్లను కించపరిచి ఓట్లు సంపాదించుకోవాలని చూస్తున్నాయని విమర్శించారు.


Similar News