Rahul-Saif: రాహుల్ ధైర్యవంతుడు, నిజాయితీ గల నాయకుడు: సైఫ్ అలీఖాన్

నటుడు సైఫ్ అలీఖాన్, కాంగ్రెస్ ఎంపీ, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై ప్రశంసలు కురిపించారు.

Update: 2024-09-27 07:34 GMT

దిశ, నేషనల్ బ్యూరో: నటుడు సైఫ్ అలీఖాన్, కాంగ్రెస్ ఎంపీ, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై ప్రశంసలు కురిపించారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన సైఫ్.. రాహుల్ ధైర్యవంతుడు, నిజాయితీ గల నాయకుడు అని పొగిడారు. తన కొత్త సినిమా దేవర పార్ట్ 1ను ప్రమోట్ చేస్తున్న ఆయన, ఇండియా టుడేతో జరిగిన ఇంటరాక్షన్‌లో భాగంగా, మీరు ఏ రాజకీయ నాయకుడిని ఇష్టపడతారు, భారతదేశాన్ని భవిష్యత్తులోకి తీసుకెళ్లగల ధైర్యమైన రాజకీయవేత్తను పేర్కొనమని వ్యాఖ్యాత అడుగుతూ, ఉదాహరణలుగా.. ప్రధాని నరేంద్ర మోడీ, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, రాహుల్ గాంధీని పేర్కొన్నారు.

దానికి సైఫ్ బదులిస్తూ, వారందరూ కూడా ధైర్యవంతులు, అయితే రాహుల్ గాంధీ పనితీరు నన్ను ఎక్కువగా ఆకట్టుకుంది. ఆయన గతంలో చేసిన పనులు, చెప్పిన మాటలను కొంతమంది అగౌరవపర్చిన సందర్భాలున్నాయి. అలాంటి పరిస్థితుల నుంచి ఆయన ఎంతో మార్పు చెందారు. తన మాటలు ప్రజల్లోకి వెళ్లడానికి, వారి ఆదరణ పొందడానికి చాలా కష్టపడ్డారు. ఆయన ప్రయాణం ఆసక్తిగా అనిపిస్తుందని సైఫ్ బదులిచ్చారు. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియో సోషల్‌‌మీడియాలో తెగ వైరల్ అయింది. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ వీడియోను ఎక్కువగా షేర్ చేస్తున్నారు.


Similar News