భారత్ సెక్యులర్ దేశం.. ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్

Update: 2023-10-12 17:14 GMT

న్యూఢిల్లీ: భారత్ 5వేల ఏళ్లుగా లౌకిక దేశంగా ఉందని ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. భారతీయులంతా కలిసికట్టుగా ఉంటూ, ప్రపంచం ముందు మానవ నడవడికకు అత్యుత్తమ ఉదాహరణగా నిలవాలని పిలుపునిచ్చారు. గురువారం ఓ పుస్తక ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ‘మన 5వేల ఏళ్ల సంస్కృతి లౌకికమైనది. ప్రపంచమంతా ఒకటే కుటుంబం అనేది మన భావన. ఇది కేవలం సిద్ధాంతం మాత్రమే కాదు. దీని గురించి తెలుసుకుని, అందుకు అనుగుణంగా ప్రవర్తించండి. ఎంతో వైవిధ్యం ఉన్న దేశంలో.. పరస్పరం పోట్లాడుకోవద్దు. మనమంతా ఒక్కటేనని ప్రపంచానికి బోధించేలా దేశాన్ని తీర్చిదిద్దండి. భారతదేశ అస్తిత్వ ఏకైక ఉద్దేశ్యం ఇదే. లోక కళ్యాణం కోసమే భారత్‌ ఆవిర్భవించింది’ అని మోహన్ భగవత్ అన్నారు.


Similar News