సాప్ట్‌వేర్ ఇంజినీర్లకు మరో బిగ్ షాక్.. 2025లో గడ్డుకాలం
పెరిగిపోతున్న టెక్నాలజీ కారణంగా వేలాది మంది యువత నిరుద్యోగులగా మిగిలిపోతుండగా.. మరికొందరు తమ ఉద్యోగాలను కోల్పోతున్నారు.
దిశ, వెబ్ డెస్క్: పెరిగిపోతున్న టెక్నాలజీ(Technology) కారణంగా వేలాది మంది యువత నిరుద్యోగులగా మిగిలిపోతుండగా.. మరికొందరు తమ ఉద్యోగాలను కోల్పోతున్నారు. ముఖ్యంగా కరోనా(carona) తర్వాత ఈ పరిస్థితి విపరీతంగా పెరిగిపోయింది. ఇటీవల కాలంలో ఏఐ(AI) రాకతో సాఫ్ట్ వేర్ ఉద్యోగులపై మరో గుదిబండి పడింది. దీంతో వేలాది కంపేనీలు తమ సంస్థలో కొత్త టెక్నాలజీని ప్రవేశ పెట్టడంతో ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది తమ ఉద్యోగాలను కోల్పోయింది. ఇది చాలదన్నట్లు మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్(Meta CEO is Mark Zuckerberg) మరో బాంబు పేల్చాడు. 2025 సంవత్సరంలో మిడ్ లెవల్ సాప్ట్‌వేర్ ఇంజినీర్ల(Mid Level Software Engineers)ను AIతో రిప్లేస్(Replace) చేస్తామని తేల్చి చెప్పారు.
ఈ ఏఐ ద్వారా ప్రస్తుతం మనుషులు చేస్తున్న కాంప్లెక్స్ కోడింగ్ టాస్కుల(Complex coding tasks)ను హ్యాండిల్ చేయగలిగే AI సిస్టమ్స్‌ను మెటా సహా పలు టెక్ కంపెనీలు డెవలప్ చేస్తున్నాయి. ఇది ఈ కొత్త AI టెక్నాలజీ గనుక అందుబాటులోకి వస్తే.. వివిధ సంస్థల్లో మిడ్ లెవల్ సాప్ట్‌వేర్ ఇంజినీర్లను పనిచేస్తున్న వందలాది మంది సాఫ్ట్ వేర్ ఉద్యోగులు తమ ఉద్యోగాలను కోల్పోయే పరిస్థితి నెలకొంది. దీంతో సాప్ట్‌వేర్ ఇంజినీర్లు(Software Engineers) రానున్న రోజుల్లో గడ్డు పరిస్థితులు(difficult situations) ఎదుర్కోవాల్సి వస్తుందని విశ్లేషకులు ముందస్తుగానే హెచ్చరికలు జారీ చేస్తున్నారు.