Remal Cyclone: రెమాల్ తుఫాన్ ఎఫెక్ట్.. ఆ రాష్ట్రంలో ఏకంగా 14 విమానాలు రద్దు
ఈశాన్య రాష్ట్రాలైన అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మణిపూర్, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్, త్రిపుర రాష్ట్రాల్లో రెమాల్ తుఫాన్ బీభత్సం సృష్టిస్తోంది.
దిశ, వెబ్‌డెస్క్: ఈశాన్య రాష్ట్రాలైన అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మణిపూర్, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్, త్రిపుర రాష్ట్రాల్లో రెమాల్ తుఫాన్ బీభత్సం సృష్టిస్తోంది. ఇప్పటికే ఆయా రాష్ట్రాల్లో సమయం గడుస్తున్నా కొద్దీ పరిస్థితి ఉద్రిక్తంగా మారుతోంది. రుమాల్ తుఫాన్ ధాటికి ఇప్పటికే ఇద్దరు మృతి చెందగా.. చాలామంది నిరాశ్రయులయ్యారు. తుపాన్ ప్రభావం కొనసాగుతుండటంతో గౌహతి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ నుంచి కోల్‌కతాకు వెళ్లే 14 విమానాలను అధికారులు రద్దు చేశారు. అందులో నాలుగు ఇండిగో విమానాలు, అలయన్స్ ఎయిర్ విమానాలు నాలుగు, ఎయిరిండియాకు చెందిన ఒకటి రద్దు చేసినట్లు అధికారులు ప్రకటించారు. అదేవిధంగా స్పైస్‌జెట్ సంస్థ తన కార్గో విమానాన్ని గౌహతిలో నిలిపివేసింది.