హిండెన్ బర్గ్ వ్యవహారంలో అదానీ గ్రూప్‌కు రిలీఫ్!
దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపిన హిండెన్ బర్గ్ నివేదిక అంశంలో అదానీ గ్రూప్‌కు ఊరట లభించింది. ఈ అంశంలో సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ నివేదిక అదానీ గ్రూప్‌కు క్లీన్ చీట్ ఇచ్చింది.
దిశ, డైనమిక్ బ్యూరో: దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపిన హిండెన్ బర్గ్ నివేదిక అంశంలో అదానీ గ్రూప్‌కు ఊరట లభించింది. ఈ అంశంలో సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ నివేదిక అదానీ గ్రూప్‌కు క్లీన్ చీట్ ఇచ్చింది. అదానీ గ్రూప్ అవకతవకలకు పాల్పడిందంటూ పెద్ద ఎత్తున అభియోగాలు రావడంతో నిజానిజాలు తేల్చేందుకు రిటైర్డ్ జడ్జి జస్టిస్ అభ్య మనోహర్ సప్రే నేతృత్వంలో సుప్రీంకోర్టు నిపుణుల కమిటీని నియమించింది. ఈ కమిటీ నివేదిక శుక్రవారం సుప్రీంకోర్టుకు చేరింది. స్టాక్స్ ధరలను నియంత్రణ వైఫల్యం జరిగిందని చెప్పలేమని నిపుణుల కమిటీ పేర్కొంది. సంబంధిత పార్టీ లావాదేవీలపై తమ అధ్యయనం జరిగిన కమిటీ నియంత్రణ వైఫల్యమేమి లేదని నివేదికలో పేర్కొంది.
రిటైల్ ఇన్వెస్టర్లను ఉపశమనం కలిగేలా అదానీ గ్రూప్ అవసరమైన చర్యలు తీసుకుందని, గ్రూప్ తీసుకున్న చర్యలు స్టాక్‌లో విశ్వాసాన్ని పెంపొందించడంలో సహాయపడిందని ప్యానెల్ పేర్కొంది. ప్రస్తుతం అదానీ స్టాక్‌లు స్థిరంగా ఉన్నాయని పేర్కొంది. హిండెన్ బర్గ్ రిపోర్ట్ తో అదానీ గ్రూప్ షేర్స్ గతంలో 60 -80 శాతం పడిపోయాయి. ఇందులో ఎలాంటి అవకతవకలు జరగలేదని సెబీ, స్టాక్ ఎక్స్ఛేంజ్ నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా ఈ కమిటీ నివేదికను రూపొందించింది. రెగ్యులేటరీ సంబంధించి అవకతవకలు అనేవి అబద్ధం అని తేల్చింది. విదేశీ పెట్టుబడులు లీగల్ గానే ఉన్నాయని తేల్చింది.