మా అధిష్టానం ఆదేశిస్తే రాజీనామాకు సిద్ధం: మణిపూర్ సీఎం
మణిపూర్ లో జరుగుతున్న హింసాకాంఢపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి న్ బీరేన్ సింగ్ స్పందించారు.
దిశ, వెబ్‌డెస్క్: మణిపూర్‌లో జరుగుతున్న హింసాకాంఢపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి న్ బీరేన్ సింగ్ స్పందించారు. గత కొన్ని రోజులుగా అల్లర్లు జరుగుతుండగా తాజాగా మహిళలను చిత్రహింసలు పెడుతున్నట్లు చూపే వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో మణిపూర్ సీఎం వెంటనే రాజీనామా చేయాలనే డిమాండ్ ను ప్రతిపక్షాలు గట్టిగా వినిపిస్తున్నాయి. దీనిపై మాట్లాడిన సీఎం.. తాను రాజీనామాకు సిద్ధంగా ఉన్నానని.. కేంద్ర నాయకత్వం కోరినప్పుడు తన పదవికి రాజీనామా చేస్తానని తెలిపారు.