Rashid Engineer : ఎంపీ రషీద్ ఇంజినీర్‌కు బెయిల్ ఇవ్వొద్దు.. కోర్టులో ఎన్‌ఐఏ వాదనలు

దిశ, నేషనల్ బ్యూరో : చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం(యూఏపీఏ) కేసులో తనకు బెయిల్ ఇవ్వాలంటూ కశ్మీర్‌లోని బారాముల్లా ఎంపీ రషీద్ ఇంజినీర్ ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై బుధవారం విచారణ జరిగింది.

Update: 2024-08-28 18:03 GMT

దిశ, నేషనల్ బ్యూరో : చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం(యూఏపీఏ) కేసులో తనకు బెయిల్ ఇవ్వాలంటూ కశ్మీర్‌లోని బారాముల్లా ఎంపీ రషీద్ ఇంజినీర్ ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై బుధవారం విచారణ జరిగింది. ఈ పిటిషన్‌ను జాతీయ భద్రతా సంస్థ (ఎన్‌ఐఏ) తరఫు న్యాయవాది తీవ్రంగా వ్యతిరేకించారు.

ప్రస్తుతం రషీద్ ఇంజినీర్ ఎంపీగా ఉన్నందున, ఆయనకు బెయిల్ మంజూరు చేస్తే అధికారాన్ని దుర్వినియోగం చేసి సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉంటుందని కోర్టుకు తెలిపారు. 26/11 ఉగ్రదాడుల సూత్రధారి హఫీజ్ సయీద్ భావజాలాన్ని సమర్ధించిన చరిత్ర ఎంపీ రషీద్ ఇంజినీర్‌కు ఉందని ఎన్ఐఏ వాదన వినిపించింది.


Similar News