ఢిల్లీలో బైక్ ట్యాక్సీకి సుప్రీం బ్రేక్..

ఢిల్లీలో బైక్ ట్యాక్సీకి సుప్రీం కోర్టు బ్రేక్ వేసింది.

Update: 2023-06-12 16:13 GMT

న్యూఢిల్లీ: ఢిల్లీలో బైక్ ట్యాక్సీకి సుప్రీం కోర్టు బ్రేక్ వేసింది. బైక్ ట్యాక్సీలు నడిపేందుకు ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన అనుమతిపై సుప్రీం కోర్టు సోమవారం స్టే విధించింది. ర్యాపిడో, ఉబర్ సహా బైక్ ట్యాక్సీ అగ్రగేటర్లకు నిర్ధిష్ట నింబంధనలు వచ్చే వరకు బైక్ ట్యాక్సీలు నడిపేందుకు అనుమతిని రద్దు చేసింది. దీంతో ర్యాపిడో ,ఉబర్ మళ్లీ కష్టాల్లో పడ్డాయి. బైక్ ట్యాక్సీలపై రాష్ట్ర ప్రభుత్వం విధానాన్ని ప్రకటించే వరకు ఢిల్లీలో ర్యాపిడో, ఊబర్ లపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని రాష్ట్ర రవాణా శాఖను ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది.

దీనిపై సుప్రీం కోర్టుకు వెళ్లిన ఢిల్లీ ప్రభుత్వం.. బైక్ ట్యాక్సీ అగ్రిగేటర్లకు లైసెన్స్ మంజూరు చేయడానికి ఇక పాలసీని రూపొందించే పనిలో ఉన్నందున హైకోర్టు ఆదేశాలపై స్టే ఇవ్వాలని కోరింది. ఈ స్పెషల్ లీవ్ పిటిషన్ ను న్యాయమూర్తులు అనిరుద్ధ బోస్, రాజేష్ బిందాల్ లతో కూడిన వెకేషన్ బెంచ్ విచారిస్తోంది. లైసెన్సింగ్ విధానం జూలై 31వ తేదీ నాటికి అమల్లోకి వస్తుందని ఢిల్లీ ప్రభుత్వం చెబుతోంది. బైక్ ట్యాక్సీలను ఫిబ్రవరిలో నిషేధించిన ఢిల్లీ ప్రభుత్వం ఉల్లంఘనులపై రూ.లక్ష జరిమానా విధిస్తామని హెచ్చరించింది.


Similar News