Prajwal Revanna : కర్ణాటక ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు షాక్.. రేప్ కేసు నమోదు

కర్ణాటలో సెక్స్ టేప్స్ స్కాండల్ రాజకీయంగా దుమారం రేపింది. దేశవ్యాప్తంగా సంచలనం రేపిన లైంగిక వేధింపుల కేసులో ప్రధాన నిందితుడు ప్రజ్వల్ రేవణ్ణకు మరో షాక్ తగిలింది.

Update: 2024-05-03 07:44 GMT

దిశ, నేషనల్ బ్యూరో: కర్ణాటలో సెక్స్ టేప్స్ స్కాండల్ రాజకీయంగా దుమారం రేపింది. దేశవ్యాప్తంగా సంచలనం రేపిన లైంగిక వేధింపుల కేసులో ప్రధాన నిందితుడు ప్రజ్వల్ రేవణ్ణకు మరో షాక్ తగిలింది. ఆయనపై అత్యాచారం కేసు నమోదైంది. ప్రజ్వల్ పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు సిట్ అధికారులు. ఐపీసీ సెక్షన్‌ 376 (బీ) (ఎన్‌), 506, 354(ఏ)(2), 354(బీ), 354(సీ), ఐటీ చట్టం కింద కేసు ఫైల్‌ చేశారు. ఎఫ్‌ఐఆర్‌లో ప్రజ్వల్‌ రేవణ్ణను ఏకైక నిందితుడిగా చేర్చారు. ప్రజ్వల్‌పై నమోదైన రెండో కేసు ఇది.

ఇదిలా ఉండగా ఈ కేసును ప్రత్యేక దర్యాప్తు సంస్థ.. సిట్‌ దర్యాప్తు చేపడుతోంది. ఇందులో భాగంగా విచారణకు హాజరవ్వాలని నోటీసులు జారీ చేసింది. 24 గంటల్లోగా జిల్లా ఎస్పీ ముందు హాజరుకావాలని ఆదేశించింది. అయితే తనకు సమయం కావాలని ప్రజ్వల్‌ రేవణ్ణ సిట్‌ అధికారులను కోరారు. కానీ అందుకు సిట్ అధికారులు తిరస్కరించారు. ఆయనపై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. వెంటనే సిట్ ముందు హాజరుకావాలని అధికారులు తెలిపారు. లేదంటే అరెస్టు తప్పదని హెచ్చరించారు.

ప్రజ్వల్‌ రేవణ్ణను హాసన్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి జేడీఎస్ బరిలోకి దింపింది. గత ఎన్నికల్లో ఇక్కడ నుంచే పోటీ చేసి గెలుపొందారు. మరోవైపు ప్రజ్వల్‌ రేవణ్ణను జేడీఎస్ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ఆ పార్టీ ప్రకటించింది.

ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక వేధింపుల గురించి పార్టీ నాయకత్వానికి లేఖ రాసినట్లు కర్ణాటక బీజేపీ నాయకుడు దేవరాజే గౌడ సిట్ కు తెలిపారు. అసభ్యకర వీడియోలతో కూడిన పెన్ డ్రైవ్ ను అధికారులకు సమర్పించారు. సిట్ ఎదుట దేవరాజే గౌడ హాజరుకాగా.. ఆయన వాంగ్మాలాన్ని నమోదు చేసుకున్నారు అధికారులు. ప్రజ్వల్ రేవణ్ణ మాజీ డ్రైవర్ కార్తీక్ తనకు పెన్ డ్రైవ్ ఇచ్చాడని తెలిపారు. హాసన్ నియోజకవర్గం నుంచి ప్రజ్వల్‌కు టికెట్ ఇవ్వవద్దని కోరుతూ ఈ ఏడాది ప్రారంభంలో కర్ణాటక బీజేపీ చీఫ్ బీవై విజయేంద్రకు లేఖ పంపినట్లు పేర్కొన్నారు.

Tags:    

Similar News