Ramdas Athawale: అధిర్ రంజన్ చౌదరిని కాంగ్రెస్ అవమానించింది.. కేంద్ర మంత్రి రాందాస్

పశ్చిమ బెంగాల్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అధిర్ రంజన్ చౌదరిని ఆ పార్టీ అవమానించిందని కేంద్ర మంత్రి, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా(ఆర్‌పీఐ) చీఫ్ రాందాస్ అథవాలే ఆరోపించారు.

Update: 2024-07-31 13:35 GMT

దిశ, నేషనల్ బ్యూరో: పశ్చిమ బెంగాల్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అధిర్ రంజన్ చౌదరిని ఆ పార్టీ అవమానించిందని కేంద్ర మంత్రి, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా(ఆర్‌పీఐ) చీఫ్ రాందాస్ అథవాలే ఆరోపించారు. బుధవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. అధిర్ రంజన్‌ను కాంగ్రెస్ అగౌరవపర్చిందని, అంతేగాక అకస్మాత్తుగా రాష్ట్ర పార్టీ చీఫ్ బాధ్యతల నుంచి తొలగించి అవమానించిందని చెప్పారు. ఇటువంటి ప్రవర్తన కారణంగానే హస్తం పార్టీలోని అనేక మంది బయటకు వచ్చి బీజేపీలో చేరుతున్నారన్నారు. చౌదరి వెంటనే కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టాలని సూచించారు. ఎన్టీఏ కూటమిలో లేదా, తమ పార్టీలో చేరాలని ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీలోనే ఉంటే భవిష్యత్ ప్రశ్నార్థకం అవుతుందన్నారు. కాగా, పశ్చిమ బెంగాల్ కాంగ్రెస్ అధ్యక్ష పదవి నుంచి ఇటీవల అధిర్ రంజన్ చౌదరికి తొలగించారు. అయితే తనను పదవి నుంచి తప్పించడంపై ఆయన అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో రాందాస్ అథవాలే వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

Tags:    

Similar News